SC notice to Rahul Gandhi on Meenakshi Lekhi's Plea రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

Sc notice to rahul gandhi for chowkidar rafale chor remark against modi

Supreme Court notice to Rahul Gandhi, BJP leader on Meenakshi Lekhi, Supreme Court notice to Rahul on chor remarks, Supreme Court notice to Rahul on chowkidar chor remarks,Chowkidar, chor, supreme court, Rahul Gandhi, Meenakshi lekhi, PM Modi, Congress, national politics, politics

Supreme Court has issued notice to Congress President Rahul Gandhi in connection with a contempt petition filed against him.

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు.. 22లోగా వివరణకు అదేశాలు

Posted: 04/15/2019 08:11 PM IST
Sc notice to rahul gandhi for chowkidar rafale chor remark against modi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ పేర్కొన్నారని, తన అభిప్రాయాలను న్యాయస్థానానికి ఆపాదిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపి ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

రాహుల్‌ మీడియాతో తాము అన్నట్లుగా చెప్పిన పలు విషయాలు తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు.

దీంతో మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టుకు తీర్పుకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని రాహుల్‌ పదేపదే ‘దొంగ’ అని దూషిస్తున్నారని, ఆయన గురించి పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ బీజేపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chowkidar  chor  supreme court  Rahul Gandhi  Meenakshi lekhi  PM Modi  Congress  national politics  

Other Articles