ECI restrains UP CM and former CM from campaigning ఉత్తర్ ప్రదేశ్ సీఎం, మాజీ సీఎంలపై ఈసీ కొరడా

Yogi adityanath mayawati punished for poll code violation

Election Commission, Supreme Court, Mayawati, Yogi Adityanath, Lok Sabha elections 2019. Uttar pradesh, politics

The Election Commission finally acted against hate speeches in the run up to the national election and barred Uttar Pradesh Chief Minister Yogi Adityanath from campaigning for 72 hours and Mayawati, for 48 hours starting tomorrow morning.

ఉత్తర్ ప్రదేశ్ సీఎం, మాజీ సీఎంలపై ఈసీ కొరడా

Posted: 04/15/2019 07:28 PM IST
Yogi adityanath mayawati punished for poll code violation

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు మత ప్రాతిపదికన ఓట్లను కోరడంపై ఈసీ వారిపై మంగళవారం నుంచి ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అ అంశాన్ని పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫిర్యాదులు అందినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 7న ఇద్దరు నేతలూ మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ కనీసం ప్రస్తావించడంగానీ, దానిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన గానీ చేయలేదని.. దీనిపై న్యాయస్థానం జోక్యంచేసుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.  దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. మతపరమైన, సైనికపరమైన, దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రసంగాల్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.  

ఇలాంటివి ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగింది. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన ఒకట్రెండు గంటల్లోనే ఈసీ చర్యలు చేపట్టింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ఉదయం 6గంటల నుంచి 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యలుచేసిన మాయావతిపై 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles