driver laxman reveals his opions about NTR sons తనయుల విషయంలో ఎన్టీఆర్ కు తీరని అవేదన

Driver laxman reveals his opions about late cm ntr sons

Senior NTR Driver Lakshman, Nandamuri Taraka Rama Rao Driver Lakshman, former CM NTR driver, NTR sons, Balakrishna, driver Lakshman, General Elections 2019, TDP, Chandrababu, Andhra Pradesh, Politics

Driver Lakshman revealed about how noted politician, popular Actor Senior NTR humiliated himself about his Sons behavior in an interview to a cahnnel.

ITEMVIDEOS: తనయుల విషయంలో ఎన్టీఆర్ కు తీరని అవేదన

Posted: 04/15/2019 03:23 PM IST
Driver laxman reveals his opions about late cm ntr sons

ఆంధ్రుల అభిమాన నటుడు, ఆరాధ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు ఎంతటి పాపులారిటీ సంపాదించారో తెలుగు ప్రజలకు తెలియనిది కాదు.. ఇక రాజకీయ రంగంలోనూ ఆయన పెను మార్పులు తీసుకువచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ మహానటుడ్ని చూసినవారంతా ఆయనకేం తక్కువ.. అన్న వ్యాక్యలు చేసినా.. నిజానికి మాత్రం ఎన్టీఆర్ కూడా తన జీవితంలో చాలా ఆవేదన భరిత క్షణాలను గడిపారని, ఆయనకు నిత్యం తన కొడుకులపైనే ఎక్కువ అలోచన వుండేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత ఆ మహనీయుడి జీవితంలోని బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలను.. అన్నగారు తమతో అడపాదడపా చెప్పుకున్న అంశాలను మీడియాతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ వద్ద చాలా కాలం పాటు డ్రైవర్ గా పనిచేసని లక్ష్మణ్ ఎన్నటీఆర్ తన కొడుకులతో ఎలాంటి సుఖాన్ని పోందలేదన్నారు.

ఆయన మాటల అంతరార్థం ఏంటంటే.. ఎన్టీ రామరావు తన కుమారుల గురించే ఎక్కువగా బాధపడుతుండేవారని, తనతో కూడా ఆ విషయాలు చెప్పుకుని బాధపడేవారని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటన్నవి కూడా ఆయన వివరించారు. ఎన్టీ రామారావు కుమారులు తండ్రి అస్తిపై బతికేస్తున్నారే తప్ప.. సొంతంగా పని చేసి పైకొద్దామనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదని.. ఈ విషయంలోనే ఎన్టీఆర్ మనసులో చాలా బాధపడేవారు. 'ఏం లచ్చన్నా... ఎవ్వడూ ప్రయోజకుడు లేడు, నా పేరు నిలిపేవాడు లేడు. ఏదో బాలయ్య కొద్దిగా ఉన్నాడు, కానీ పూర్తి నమ్మకం లేదు.' అని చెబుతూ ఒకసారి బాధ పడ్డారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదని.. ఆయన్ను చివరి వరకు వారు కష్టపెట్టారని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. కొడుకులంతా కేవలం డబ్బు కోసమే తండ్రి వద్దకు వచ్చేవారని ఆయన తెలిపారు. డబ్బు అవసరం అయినపుడు వచ్చి పెద్దాయన ముందు రెండు చేతులు కట్టుకుని నిలబడేవారని చెప్పారు. డబ్బు అవసరం లేనంత వరకు తండ్రిని చూసేందుకు కూడా వచ్చేవారు కాదని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఎన్టీఆర్ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తే... తాను, మోహన్ వెళ్లి స్వయంగా అందరికీ ఇచ్చి వచ్చేవారమని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

మొదటి సారిగా ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయినపుడు జయశంకర్ బాబుకు కూర్చో పెట్టి చాలా చెప్పాడు. ''నువ్వు బయట తిరిగు... ఏ ఫ్యాక్టరీ పెడితే బావుంటుందనే విషయం కనుక్కో, నేను నీకు ఫ్యాక్టరీ పెట్టిస్తాను, ఐదు, పది వేల మందికి భోజనం పెట్టినవారం అవుతాం. థియేటర్ చూసుకోవడం ఏమిటి? దాన్ని చూసుకోవడం కూడా మీకు చేతకాదు... దానికి ఇంకా ఓ మేనేజర్‌ను పెట్టుకుంటారు.'' అంటూ జయశంకర్ బాబుకు పెద్దాయన చెప్పినట్లు లక్ష్మీణ్ వెల్లడించారు. కాగా, కూతురు పురంధరేశ్వరి రోడ్ నెం.13 దగ్గర్లనే ఉండేవారు. అప్పుడప్పుడూ క్యారేజ్ పట్టుకుని వచ్చేవారని లక్ష్మణ్ తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : former CM NTR driver  Lakshman  NTR sons  Balakrishna  TDP  Andhra Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh