police traced mystery in lavanya case లావణ్య కేసులో మిస్టరీని చేధించిన పోలీసులు

Police traced mystery in lavanya case techie held for lover murder

murder case, police investigation, suitcase, cyberabad police, sooraram colony, sunil, lavanya, software engineers, crime, latest news updates

After a case of murder has been registered, cyberabad police teams have been deployed to trace the mystery in software engineer Lavanya case, arrested the accused sunil. police enquriy revealed lavanya insisted for marriage, but denied sunil murdered her.

ప్రేమించినవాడే కాలయముడు: లావణ్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు

Posted: 04/15/2019 01:29 PM IST
Police traced mystery in lavanya case techie held for lover murder

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య మర్డర్ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ప్రేమించినవాడే అమె పాలిట కాలయముడై తన ప్రాణాలను బలిగొన్నాడని తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో లావణ్యను చంపింది తానేనని అంగీకరించాడు నిందితుడు. ప్రేమించి, లోంగదీసుకుని.. పెళ్లి అనేసరికి తప్పించుకోలేక మర్డర్ ప్లాన్ చేసిన కరడుగట్టిన కసాయి గురించిన వివరాలను రామచంద్రపురం పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపారు.

బీహార్‌కు చెందిన మనోజ్ షా కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలసవచ్చి సూరారం కాలనీలో స్థిరపడింది. ఆయన కుమారుడు సునీల్ మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కాలేజీకి చెందిన రామచంద్రాపురం నివాసి శ్రీనివాస్‌రావు కుమార్తె లావణ్య (25)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం బీటెక్ పూర్తైన తర్వాత కూడా కోనసాగి ఇద్దరిమధ్య ప్రేమకు దారితీసింది. దీంతో లావణ్యను పెండ్లి చేసుకొంటానని నమ్మించిన సునీల్.. అమెను లోబర్చుకున్నాడు.

పెళ్లి చేసుకోమ్మని సునీల్ ను తరచూ అడుగుతున్న లావణ్య.. ఈ మధ్యకాలంలో మరింతగా ఒత్తిడి తెచ్చింది. దీంతో అమెను అడ్డు తోలగించుకోవాలని నిర్ణయించుకున్న సునిల్ అమెను హత్యచేసి.. సూట్ కేసులో శవాన్ని పెట్టి తాను నివసించే సూరరం కాలనీకి వెళ్లేదారిలోని కాలువలో పడేశారు. యువతి తల్లిదండ్రులు అనుమానం రావడంతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేయగా.. అదే సమయంలో యువతి శవం సూరారం కాలనీలో బయటపడటం..  కేసు విచారణకు సులభం చేసింది.

పథకం ప్రకారమే..

పెళ్లి చేసుకోవాలని వెంటపడి ఒత్తడి తీసుకువస్తున్న లావణ్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సునీల్ పక్క పథకం ప్రకారమే అమెను హత్య చేశాడు. ఎలా అంటే.. ఉద్యోగ నిమిత్తం తాను సూడాన్ వెళ్తున్నానని, లావణ్యను కూడా తీసుకెళ్తున్నట్టు ఆమె కుటుంబీకులను ఒప్పించాడు. ఈనెల 4న ఇద్దరూ సూడాన్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరికి యువతి తల్లిదండ్రులు విమానాశ్ర యం వరకు వచ్చి వీడ్కోలు పలికారు.

సూడాన్ వెళ్తున్నట్టు నకిలీ విమాన టికె ట్లు సంపాదించిన సునీల్.. విమానాశ్రయంలోకి అలా వెళ్లి ఇలా బయటకు వచ్చాడు. సూడాన్ వెళ్లే విమానం రద్దయిందంటూ లావణ్యను నమ్మించి ఆ రాత్రి శంషాబాద్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. మరుసటిరోజు పెండ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో లావణ్యను చంపి.. శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కాడు. 6వ తేదీన రాత్రి సూరారం సుందర్‌నగర్‌లోని ఇంటికి వస్తూ స్థానికంగా ఉన్న మోరీలో లావణ్య శవం ఉన్న సూట్‌కేసును పడేశాడు.

సూడాన్ నుంచి చాటింగ్ చేస్తున్నట్టు లావణ్య తల్లిదండ్రులకు వాట్సప్ మెసేజ్‌లు పెట్టేవా డు. ఇండియాకు తిరిగి వస్తున్నట్టు 7న లావణ్య మొబైల్ నుంచి సమాచారమిచ్చాడు. తమ కూతురు ఇంటికి తిరిగిరాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి ఆర్సీపురం పోలీసులను ఆశ్రయించారు. సునీల్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొని విచారించగా లావణ్యను తానే హత్యచేసినట్టు ఒప్పుకొన్నాడు. నాలాలో నుంచి లావణ్య మృతదేహాన్ని వెలికితీసి గాంధీ దవాఖానకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh