case filed against ambati Rambabu in Kodela siva prasad attack case కొడెలపై దాడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు

Case filed against ysrcp leader ambati rambabu in kodela siva prasad attack case

case filed against YSRCP leader ambati Rambabu, police case against ambati Rambabu, police case against YSRCP Leader, kodela siva prasad rao, Ambati Rambabu, police case, sattenapalli, Guntur, Andhra Pradesh, Politics

YSRCP spokes person and senior leader Ambati Rambabu had been booked for provocating mob and attacking senior TDP Leader siva Prasad Rao in sattenapalli constituency of Guntur district.

కొడెలపై దాడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు

Posted: 04/13/2019 01:42 PM IST
Case filed against ysrcp leader ambati rambabu in kodela siva prasad attack case

టీడీపీ నేత, సిట్టింగ్ అంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ పై సరిగ్గా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన ఈ నెల 11న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ  వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై హత్యాయత్నంతో పాటు భారత శిక్షాస్మృతిలోని మరో 10 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు.

ఎన్నికల రోజున పోలింగ్ జరుగుతున్న క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు ఎలా వున్నాయన్న విషయమై పరిశీలించేందుకు వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అంబటి వర్గీయులు కుట్ర పన్నారని, ఆయన వస్తున్న సమాచారం అందుకుని మార్గమధ్యంలోనే అతనిపై దాడికి యత్నించారని, అతని కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారని టీడీపీకి చెందిన పలువురు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిర్యాదును అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు.

ఈ దాడికి అంబటి రాంబాబు కుట్ర పన్నారని ఆరోపిస్తూ వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని సత్తెనపల్లి డీఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం పోలీసులు సేకరించారు. కోడెలపై దాడి జరిగిన సమయంలో పోలింగ్ బూత్ లో ఉన్న అధికారుల నుంచి, స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad rao  Ambati Rambabu  police case  sattenapalli  Guntur  Andhra Pradesh  Politics  

Other Articles