Sangeetha Krish hits out and abandons her mother తల్లిని ఇంట్లోంచి తరిమేసిన నటి సంగీత..

Sangeetha alleges mom of exploiting her for alcoholic and drug addict sons

Sangeetha krish, Sangitha krish, Singer krish, Actress sangeetha, Kollywood 2019 controversy, Sangeetha krish controversy, Tamil Nadu State Association for Women, Sangeetha mother Bhanumathy, Kollywood, entertainment news, movies, crime

Sangeetha Krish has been in the news recently after her mother Bhanumathy filed a complained against her at the Tamil Nadu State Association for Women alleging that she was thrown out of the house at old-age.

తల్లిని ఇంట్లోంచి తరిమేసిన నటి సంగీత..

Posted: 04/13/2019 11:27 AM IST
Sangeetha alleges mom of exploiting her for alcoholic and drug addict sons

దక్షిణాదిలో తళుక్కున మెరిసి ఆ తరువాత కొంత తెరచాటైన నటి సంగీత గుర్తుందా.? ఇలా అడిగితే ఎలా గుర్తుంటుందంటారా.?ఖడ్గం చిత్రంలో రవితేజ మాదిరిగా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన తెలుగు ప్రజలకు గుర్తిండిపోయిన హీరోయిన్ సంగీత గుర్తుందా.? అవునండీ అమె తన సినీజీవితంలో గ్యాప్ రావడంతో సినీమా ఇండస్ట్రీకే చెందిన ఓ గాయకుడిని వివాహం చేసుకుని ఆ తరువాత మళ్లి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి సంగీతపై.. తాజాగా కాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ధనంమూలమ్ ఇదం జగత్ అన్న సూక్తిని బాగా వంటపట్టించుకున్న సంగీత.. తన పేరున ఉన్న ఉమ్మడి అస్తిని కాజేసేందుకు తనను కన్న తల్లినే ఇంట్లోంచి బయటకు తరిమేసిందని వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇందులో నిజానిజాలు ఏంటన్న విషయాన్ని పక్కనబెడితే.. వృద్దాప్య దశలో తాను ఎవరి ఇంటికి వెళ్లాలి.? ఎక్కడ తలదాచుకోవాలి అంటూ అమె తల్లి బానుమతి తమిళనాడులోని మహిళా కమిషన్ ను అశ్రయించింది.

ఈ విషయంలో మహిళా కమీషన్ జారీ చేసిన నోటీసులను అందుకున్న నటి సంగీత, అమె భర్త గాయకుడు క్రిష్ గత మూడు రోజులుగా మహిళా కమీషన్ విచారణకు హాజరవుతూ.. అక్కడ మీడియా కంట పడ్డారు. దీంతో వారం రోజుల క్రితం అమె తన ఇంట్లోంచి తన తల్లిని గెంటేసిన విషయం కూడా మీడియాకు పొక్కింది. దీంతో అమెను వివరణ కోరగా.. వ్యక్తిగత విషయాల్లోకి జోక్యం చేసుకోవద్దని కూడా అమె మీడియాకు కూడా ఘాటుగానే బదులిచ్చింది.

అసుల గోడవ ఏంటీ అంటే.. :

తమిళనాడు రాష్ట్రం పెరంబూరులో నివాసం ఉంటుంది సంగీత. రెండు అంతస్తుల బిల్డింగ్ అది. ఏడేళ్ల క్రితం క్రిష్ తో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆ బిల్డింగ్ కింద సంగీత ఉంటే.. పైన తల్లి ఉంటుంది. సంగీత తమ్ముడితో కలిసి తల్లి నివసిస్తుంది. ఇటీవలే సంగీత తమ్ముడు చనిపోయాడు. ఆ తర్వాత నుంచి ఒంటరిగా ఉంటుంది. ఈ బిల్డింగ్ సంగీత పేరున ఉంది. కాకపోతే ఉమ్మడి ఆస్తిగా చెబుతున్నది తల్లి. ఈ ఇంట్లోనే తల్లి ఉంటే.. ఆస్తిలో వాటా కావాలని అన్న, ఇతరులు వచ్చే అవకాశం ఉందని భావించిన సంగీత.. తల్లిని ఇంటి నుంచి గెంటివేసినట్లు కంప్లయింట్ చేసింది తల్లి భానుమతి. ఈ వయస్సులో ఎక్కడి వెళ్లాలి అని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆమె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangeetha  Actress  Bhanumathy  sangeetha controversy  Kollywood crime  

Other Articles