LaxmiNarayana leads in Visakha race, cross voting benifits Janasena జేడీ లక్ష్మీనారాయణకు కలిసిరానున్న క్రాస్ ఓటింగ్

Jd laxminarayana leads in visakha race cross voting benifits janasena

pawan kalyan, janasena, Pawan Kalyan VV Laxmi Narayana, Pawan Kalyan VV Laxmi Narayana visakhapatnam, VV Laxmi Narayana JanaSena, VV Laxmi Narayana visakhapatnam, JD VV Laxmi Narayana, visakha parliamentary constituency, andhra pradesh, politics

Noted CBI former Joint director and politician VV Laxmi Narayana, who contested from visakhapatnam lok sabha constituency on behalf of Janasena party is leading the race says the sources.

విశాఖ లోక్ సభ స్థానంలో క్రాస్ ఓటింగ్ జనసేనకు లాభించేనా..?

Posted: 04/12/2019 04:30 PM IST
Jd laxminarayana leads in visakha race cross voting benifits janasena

రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ నవ్యాంధ్రలో ఎంతమేర ప్రభావం చూపింది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఏ మేర ఆ పార్టీకి కంకణబద్దులై ఓటు వేశారు.? రాష్ట్రంలో పవన్ పార్టీ ఏ మేర ఓట్ల శాతాన్ని రాబట్టింది.? అన్న వివరాలు మే 23 తేదీన వెల్లడయ్యే ఫలితాలపై అధారపడి వుంటుందన్న విషయం తెలిసిందే. అయితే జనసేన తరుపున లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సీబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ విశాఖలో పాగా వేస్తారా.? అన్నదే ఇప్పుడు విశాఖవాసుల్లో హాటా టాపిక్ గా మారింది.

సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఓటరు తీర్పును ఎలా ఇచ్చారన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక గాజువాక అసెంబ్లీ స్థానం కూడా అంతే ప్రాధాన్యత క్రమంలో హాట్ టాపిక్ గా మారింది. గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడం, విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున వి.వి.లక్ష్మీనారాయణ రంగంలో ఉండడమే ఇందుకు కారణం.

మరీ ముఖ్యంగా విశాఖ లోక్‌సభ స్థానం విషయంలో పార్టీలకతీతంగా ఓ అభ్యర్థి విషయంలో చర్చ నడిచింది. ఆయనే లక్ష్మీనారాయణ. చతుర్ముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి తప్ప టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. కానీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మీనారాయణకు తన సోంత ఇమేజ్ తో పాటు పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ కూడా తోడై.. విశాఖ నగరవాసులతో పాటు ఆ లోక్ సభ పరిధిలోని పట్టణ ప్రాంతవాసులను అధికంగా అట్రాక్ట్ చేశారన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి.

గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్ కేసులతో పాటు వై.ఎస్‌.జగన్‌ అక్రమాస్థుల కేసులలో విచారణ ప్రత్యేక అధికారిగా అప్పట్లో ఆయనకు మీడియా సహా పత్రికలు కూడా విశేష ప్రాచుర్యాన్ని కల్పించాయి. కేసు విచారణలో బాగంగా అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు ఉత్కంఠను పెంచాయి. దీనికి తోడు ఆయన నిజాయితీ పరుడున్న విశ్వాసం కూడా ప్రజల్లో బలంగా నాటుకోవడంతో ఈ అంశాలు కూడా ఆయనకు బాగా లాభించాయని విశ్లేషకుల అంచానా.

అయితే విశాఖ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో గాజువాక మినహా మిగిలిన ఆరు చోట్ల జనసేన అభ్యర్థులు అంత బలమైన వారేమీ కాదు. యువతలో ఆ పార్టీ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉన్నప్పటికీ అది ఏ స్థాయి ప్రభావం చూపుతుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. అయితే తన ఇమేజ్, పవన్ ఇమేజ్ కు తోడు ఆయనపై ప్రజలకున్న విశ్వాసం.. అన్ని పార్టీల ఓటర్లు ఆయనకు క్రాస్ ఓటింగ్ వేశారన్న టాక్ ముమ్మరంగా వినిపిస్తోంది. విద్యావంతుడు, నిజాయితీ పరుడు, నిరాడంబరుడు కావడం ఆయనకు అవకాశం ఇవ్వాలన్న విశాఖ బలమైన, ధృడమైన నిర్ణయంతోనే ఈ మేర క్రాస్ ఓటింగ్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.

స్థానికేతరుడన్న విమర్శ వచ్చినప్పటికీ తాను ఇక్కడే ఇల్లు తీసుకుని నివాసం ఉంటానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే తాను ఏం చేయబోతున్నదీ బాండ్‌ పేపర్‌పై రాసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మాట తప్పితే తనపై ఎవరైనా కేసు పెట్టవచ్చని నగరవాసులకు హామీ ఇచ్చారు. ఆయన మాటలను విశ్వసించిన విశాఖ ఓటరు ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నగరంలో స్థానికేతర ఓటర్లు గణనీయంగా ఉన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు విశాఖ నెలవుగా వుండటం, ప్రచారం సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారితో వారి మాతృభాషలో మాట్లాడి లక్ష్మీనారాయణ ఓట్లను అభ్యర్థించడం వారిని ఆకర్షించిందని చెబుతున్నారు. ఇలాంటి పలు అంశాలు క్రాస్‌ఓటింగ్‌కు కారణమయ్యాయని చెబుతున్నారు. పార్టీ అభిమానులు కూడా అసెంబ్లీ విషయంలో తమ అభిమాన పార్టీ అభ్యర్థికి ఓటేసినా, లోక్‌సభ అభ్యర్థికి వచ్చేసరికి లక్ష్మీనారాయణ పట్ల మొగ్గుచూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  VV Laxmi Narayana  visakhapatnam lok sabha  andhra pradesh  politics  

Other Articles