Congress attacks Smriti over academic qualification విద్యార్హతలపై కేంద్రమంత్రి స్మృతిఇరానీకే క్లారిటీ లేదా.?

Congress attacks smriti over academic qualification

smriti irani educational qualification, smriti irani inter pass, inter pass hrd minister for india, smirti irani contracitory information, Congress, Smriti Irani, affidavits, Lok Sabha Elections 2019, Priyanka Chaturdevi, Amethi, National politics

The Congress accused Union Minister Smriti Irani of furnishing "contradictory information" about her educational qualifications in the affidavits filed during various elections since 2004.

విద్యార్హతలపై కేంద్రమంత్రి స్మృతిఇరానీ అప్పుడలా.. ఇప్పుడిలా..

Posted: 04/12/2019 03:35 PM IST
Congress attacks smriti over academic qualification

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మళ్లీ దేశవ్యాప్తంగా వేడి రాజేస్తున్నాయి. ఈ విషయంలో అమె గతంలో ఓక మాట, తాజాగా మరో మాట చెప్పడంతో.. అమె ఎం చదివారన్న విషయంలో అమెకే క్లారిటీ లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ లోక్ సభ స్థానం నుంచి ఆయనకు పోటీగా మరోమారు అమె బరిలో నిలిచారు. దీనికి సంబంధించి ఆమె ఏప్రిల్ 11న అయేథీలో నామినేష్  వేశారు.

ఈ నామినేషన్ లో తన విద్యార్హతను డ్రిగ్రీ పూర్తిచేయనట్లుగా చూపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. 2004 నామినేషన్ పత్రాలలో డిగ్రీ పూర్తయినట్లుగా స్మృతి వెల్లడించారు. ఆ తరువాత ఇదే అంశం అమె కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పటినప్పుడు కూడా వివాదాస్పదం కాగా, అప్పుడు కూడా తాను డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పుకోచ్చారు. అయితే తాజాగా క్రితం రోజున అమె సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం డిగ్రీ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు మరోసారి ఆమె విద్యార్హతలపై వివాదం చెలరేగింది.
 
2014లో బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని.. ఇప్పుడేమో బీకాం పూర్తి చేయలేదని పేర్కొన్నారు స్మృతి ఇరానీ. తాజాగా నిన్న దాఖలు చేసిన ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారు. 1991లో ఆల్ ఇండియన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(పదో తరగతి), 1993లో ఆల్ ఇండియన్ సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(ఇంటర్) పాస్ అయినట్లుగా ఆమె వెల్లడించారు.

ఇప్పటికి ఆమె డిగ్రీ విషయంలో మూడు సార్లు మూడు రకాలుగా తెలిపారు. నిన్న దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో దూర విద్యలో బ్యాచిలర్ కామర్స్ పార్ట్ 1 మాత్రమే చదివానని, డిగ్రీ మొత్తం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అయితే 2004 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడెవిట్ ప్రకారం స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు.

2014 ఎన్నికల ఆఫిడవిట్‌లో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. అంతే కాదు.. 2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. యూఎస్‌లోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు చెప్పారు. కాగా గతంలో కూడా స్మృతి విద్యార్హతలపై విపక్షాలు ఘాటుగా స్పందించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆమె విద్యార్హతలను తెలియజేయాలని డిమాండ్ చేస్తోంది.

ఇక స్మృతి ఇరానీ బిఏ చదివరా.. లేక బీకామ్ చదివారా.? ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లేక ఢిల్లీ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ నుంచా.? ఇదీ కాద యూఎస్ లోని యేల్ యూనివర్సిటీ నుంచా.? అన్న విషయంలో అమెకే క్లారిటీ లేకపోతే.. ఇక దేశం గురించి.. ప్రజల భవిష్యత్తు గురించి అమెకు ఏలాంటి ఐడియా వుంటుందో అర్థం చేసుకోవచ్చునంటూ నెట్ జనులు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles