Three Phase security at strong rooms స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడెంచల భద్రత..

Three phase security at strong rooms with central and state forces

Three Phase security at strong rooms, Three Phase security at strong rooms, central armed forces security at strong rooms, state forces at strong rooms, 144 section at strong rooms, Three Phase security, strong rooms, central armed forces, state special forces, Telangana, andhra pradesh, politics

After completion of voting, amid tight security, EVMs were shifted to respective strong rooms and security personnel were deployed outside the strong rooms. Three Phase security is provided at strong room centers.

ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడెంచల భద్రత..

Posted: 04/12/2019 01:41 PM IST
Three phase security at strong rooms with central and state forces

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎవరు ఏ మేర ఓట్ల సాధించారన్నది, సీట్లు సాధించరన్న వివరాలు, ఓట్ల శాతం ఏ పార్టీకి ఎంత మేర వచ్చిందన్న వివరాలు మాత్రం వచ్చే నెల 23న కానీ తెలియవు. ఆ రోజున ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే అప్పటి వరకు ఓటరు తీర్పుమాత్రం ఈవీఎంలలో నిక్షిప్తమైవుంది.

అయితే ఓటరు తీర్పును పథిలపర్చుకున్న ఈవీఎంలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రజాతీర్పును తమవైపు తిప్పుకునేందుకు చిప్ లు, ఇతరాత్ర మార్గాలను అన్వేషిస్తున్నారన్న అరోపణలు తెరపైకి రావడంతో ఈ సారి గతంలో కంటే భిన్నంగా ఈవీఎంలను భద్రపరచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. ఆ భద్రత ఎలా వుంటుందంటే..

తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి. ఇది మొదటి దశ భద్రత. ఇక రెండో దశలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కార్యకర్తలు ఫిఫ్ట్ ల వారీగా ఈవీఎంలకు కాపలా కాయాలని పిలుపునిచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles