Kaveri Travels Cancels Bus Services to AP ఏపీకి బస్సులను రద్దు చేసిన కావేరీ ట్రావెల్స్.. ప్యాసెంజర్లకు షాక్

Kaveri travels cancels 125 bus services to ap day before elections

Kaveri Travels Cancels Bus Services to AP, shock to passengers day before elections, Andhra Pradesh Assembly Elections, passengers are smelling conspiracy, Kaveri Travels, 125 bus services, passengers, assembly elections, andhra pradesh, politics

Kaveri Travels Cancels 125 Bus Services to Andhra Pradesh just a Day Before Assembly Elections In the state along with Lok Sabha Elections. This created huge crowd at all bus stands and railway stations. passengers are smelling conspiracy in bus cancellations.

ఏపీకి బస్సులను రద్దు చేసిన కావేరీ ట్రావెల్స్.. ప్యాసెంజర్లకు షాక్

Posted: 04/10/2019 01:43 PM IST
Kaveri travels cancels 125 bus services to ap day before elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ షాకిచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సొంత ఖర్చులు పెట్టుకుని మరీ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న ఓటర్లకు కావేరి ట్రావెల్స్ షాకిచ్చింది. ఓ వైపు ఎన్నికల సంఘం అధికారులు, ప్రజా సంఘాలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తుంటే.. అదే అవకాశంగా తీసుకుని చార్జీలను పెంచి కస్టమర్ల జేబులకు చిల్లులు పెడుతున్న ప్రేవేటు ట్రావెల్స్ సంస్థలు లాభాలను బేరిజు వేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో కావేరి ట్రావెల్స్ కు చెందిన ఏకంగా 125 బస్సులను చివరి నిమిషంలో రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పదో తేదీన ఊరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలా చాలామంది ప్రైవేటు ట్రావెల్స్‌ను నమ్ముకున్నారు. అయితే, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం అకస్మాత్తుగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.

దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్ లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే బస్సుల రద్దు వెనుక కూడా పలు రాజకీయ పార్టీల కుట్రలు వున్నాయన్న అరోపణలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaveri Travels  125 bus services  passengers  assembly elections  andhra pradesh  politics  

Other Articles