Indian Army not Modi's, says VK Singh, then denies it అర్మీని మోదీ సేనగా అభివర్ణించడంపై మాటమార్చిన వీకే సింగ్..

Vk singh says army is nation s sena never call it modi ki sena

Modiji ki sena, Indian army, traitors, VK Singh, Yogi Adityanath, Mukhtar Abbas Naqvi, Congress, BJP, PM Narendra Modi, National politics

Union Minister VK Singh said the armed forces do not belong to an individual but to the nation, even as his colleague Mukhtar Abbas Naqvi and UP CM Yogi adityanath referred the Army as 'Modiji ki sena'.

అర్మీని మోదీ సేనగా అభివర్ణించడంపై మాటమార్చిన వీకే సింగ్..

Posted: 04/05/2019 04:59 PM IST
Vk singh says army is nation s sena never call it modi ki sena

ఆర్మీని ‘మోదీ సేన’గా అభివర్ణించిన బీజేపి ముఖ్యమంత్రిపై కేంద్రమంత్రి, మాజీ అర్మీ జనరల్ వీకే సింగ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. భారత రక్షణకు చెందిన త్రివిధ దళాలు దేశభద్రతకు కట్టుబడి వున్నాయని, ఉంటాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపి నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సైన్యాన్ని ‘మోదీ సేన’గా అభివర్ణించేవారు దేశ ద్రోహులే అవుతారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలా చెప్పడం తప్పు మాత్రమే కాదని, దేశద్రోహం కూడా అని పేర్కొన్న మంత్రి అధిష్టానం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యో లేక సొంత పార్టీ ముఖ్యమంత్రిని, సహచర నాయకుడిని తప్పబట్టడం ఎందుకనో మొత్తానికి యూ-టార్న్ తీసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల బీజేపీ ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపిస్తే.. మోదీ సేన ఉగ్రవాదులపై బాంబులు, బులెట్లతో విరుచుకుపడుతోందని వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ ఆయనకు నోటీసులు పంపింది. యోగి వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని ఎవరైనా మోదీ సేన అనడం ముమ్మాటికీ తప్పేనన్నారు. అలా పేర్కొన్నవారు దేశానికి విశ్వాసఘాతకుడు కూడా అవుతాడని అన్నారు.

ఆర్మీ దేశానికి చెందినదని, అది ఓ రాజకీయ పార్టీకి చెందినది కాదని సింగ్ తెగేసి చెప్పారు. ఇక తాజాగా ఆయన మీ తన వ్యాఖ్యలపై తనకు పూర్తి రికార్డు వుందని తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచురించినందుకు ఆ రిపోర్ట్ కు ఎంత ముట్టిందని యూ టార్న్ తీసుకున్నారు. అంతేకాదు మీ రిపోర్టర్ ఫడుకున్నారేమోనన్న అనుమానాలు కూడా వున్నాయని ఆ సంస్థకు సభ్యులతో మాట్లాడుతూ అన్నారు. అంతేగామరి.. ఎటుపోయి మద్యలో నలిగిపోయేది మీడియానే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VK Singh  Yogi Adityanath  Mukhtar Abbas Naqvi  Congress  BJP  PM Narendra Modi  national politics  

Other Articles