Rahul Gandhi files nomination from Wayanad వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు

Rahul gandhi files nomination from wayanad holds roadshow with priyanka

Rahul Gandhi, Wayanad district, Kerala, Priyanka Gandhi, Uttar Pradesh, amethi, Congress, Road show, Kerala, Politics

Congress President Rahul Gandhi filed his nomination papers from Kerala's Wayanad, and then held a roadshow there along with sister Priyanka Gandhi Vadra and other party leaders.

వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు

Posted: 04/04/2019 07:19 PM IST
Rahul gandhi files nomination from wayanad holds roadshow with priyanka

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రం వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. సోదరితో కలిసి రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అమేథి, వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్న రాహుల్. వాయనాడ్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో చేరుకున్నారు. వేలాది కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం కోసం రాహుల్ బుధవారం సాయంత్రమే కోజికోడ్‌ వెళ్లారు.  

దక్షిణాది నుంచి పోటీ చేయాలనే పార్టీ నేతల డిమాండ్ మేరకు రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ కంచుకోట అయిన యూపీలోని అమేథీతో పాటు వయనాడ్‌ నుంచి రాహుల్‌ ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. వయనాడ్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత ఎంఐ షానావాస్‌ ఇక్కడ నుంచి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌, ఎన్డీయే అభ్యర్థి తుషార్‌ వెల్లపల్లితో రాహుల్ తలపడనున్నారు.

ఈ సందర్భంగా.. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. దేశమంతా ఒక్కటే అని చాటి చెప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తమను శత్రువులా చూస్తున్నట్లు దక్షిణాది ప్రజలు భావిస్తున్నారని.. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే భావన దక్షిణాది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని రాహుల్ చెప్పారు. ఈ అంతరాన్ని చెరిపేయడానికే తాను వయనాడ్ నుంచి బరిలోకి దిగినట్లు వివరించారు.

అనంతరం అక్కడ రాహుల్, ప్రియాంక రోడ్డుషో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కోజికోడ్ లో భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు రాహుల్ తన నాయినమ్మ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బాటనలో నడుస్తూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.

అయితే ఈ నామినేషన్ పూర్తయిన అనంతరం ప్రియాంకా గాంధీ భావోద్వేగ సందేశాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీని జాగ్రత్తగా చూసుకోవాలని అమె కోరారు. అమె ట్వీట్ సారాంశమిలా వుంది. ‘‘నా సోదరుడు నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు చాలా ధైర్యవంతుడు. వయనాడ్‌ ప్రజలారా.. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచడు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Wayanad district  Kerala  Priyanka Gandhi  Uttar Pradesh  amethi  Congress  Road show  Kerala  Politics  

Other Articles