Rahul Gandhi takes injured Journalist to hospital మరోమారు మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ

Rahul gandhi saves the day takes injured journalist to the hospital

Rahul Gandhi turned a saviour, Congress president Rahul Gandhi, Rahul gandhi injured journalist, rahul gandhi rajendra vyas, rahul gandhi aiims delhi, Rahul Gandhi, journalist, rajendra vyas, AIIMS, Humayun Road, Central Delhi, AIIMs, Congress, Social Media, crime, National politics

Congress president Rahul Gandhi turned a saviour when he helped an injured journalist reach the AIIMS in New Delhi in his vehicle. A video of Gandhi and the journalist, Rajendra Vyas, sitting in the vehicle is being shared on social media.

మానవత్వం పరిమళించిన మంచి నాయకుడు రాహుల్ గాంధీ

Posted: 03/27/2019 11:19 PM IST
Rahul gandhi saves the day takes injured journalist to the hospital

మానవత్వం గురించి నేతలు మాటలు చెబితే కోటలు కూడా బద్దలవుతాయన్నది తెలిసిన విషయమే. ఎందుకంటే నేతలు మాటల్లో తప్ప అచరణ మానవత్వంతో వ్యవహరించరని విమర్శలున్నాయి. మథుర బీజేపి ఎంపీ నటి హేమమాలిని కారు ప్రమాదంలో డాక్టరు కారును ఢీకొన్న ఘటనలో బాధితులు ఇలాంటి అరోపణలే చేశారు. అయితే వారిపై కాసింత కూడా మానవత్వం లేకుండా తమ తండ్రికి సాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోకుండా అమె వ్యవహరించిందని బాధితులు అరోపించిన విషయం తెలిసిందే.

ఇక కేంద్రమంత్రి, టీవీ నటి, రాజ్యసభ సభ్యురాలు సృతిఇరానీ కాన్వాయ్ లోని ఓ వాహనం మరో వాహనాన్ని ఢికొన్న ఘటనలో క్షతగాత్రులకు స్వయంగా  సాయం అందించాల్సిన మంత్రి.. అలా చేయకుండా వెళ్లిపోయిందని.. అమెపై విమర్శలు వెల్లివిరిసిన క్రమంలో.. తాను వారికి సాయం చేయడానికి అంబులెన్సుకు ఫోన్ చేసి పంపించానని.. దాంట్లోనే వారు అసుపత్రికి వెళ్లారని అమె చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలతో నేతలు అంతా ఒకేటే పాఠం చదివారని, వారు ప్రసంగాలు చేయడానికే తప్ప.. అచరించడానికి కాదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది.

అయితే అందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం మినహాయింపు అన్నది ఇప్పటికీ పలు ఘటనల ద్వారా నిరూపితమైంది. యూపీ ఎన్నికల సమయంలో అమేధీలో ప్రచారం ముగించుకుని తిరుగుపయనమైన రాహుల్ గాంధీకి రోడ్డు ప్రమాదంలో ఓ వాహనదారుడు రక్తమోడుతూ కనిపించగానే అదే సమయంలో తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని అసుపత్రికి పంపించారు రాహుల్ గాంధీ. అయితే అదే సమయంలో పలు ఘటనలు చోటుచేసుకోవడంతో.. రాహుల్ మానవత్వం హైలైట్ అయ్యింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ ఫోటో జర్నలిస్టు కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ పొరపాటున మెట్లు జారి కిందకు పడుతుండగా చెయ్యందించి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆయన మరోసారి మానవత్వం చాటుకుని వార్తల్లో నిలిచారు. రాహుల్ తన వాహనంలో వెళుతుండగా రోడ్డుపై గాయపడిన రాజేంద్ర వ్యాస్ అనే జర్నలిస్టును చూశారు. వెంటనే కారు ఆపి ఆయనను తన కారులో ఎక్కించుకుని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర వ్యాస్‌కు నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రాజస్థాన్ కి చెందిన వ్యాస్, సెంట్రల్ ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ సిబ్బంది రక్తమోడుతున్న వ్యాస్ ను కారులో ఎక్కించుకొని పోవడం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles