Cheating case against BJP leader Muralidhar Rao బీజేపి జాతీయ ప్రధానకార్యదర్శిపై చీటింగ్ కేసు..

Police register cheating case against bjp national general secretary

cheating case on bjp national general secretary, BJP national general secretary P.Muralidhar Rao, Muralidhar Rao, cheating case, Rachakonda police, Nirmala Sitharaman, Telangana, politics

The Rachakonda police had filed an FIR against BJP national general secretary P.Muralidhar Rao and eight others for allegedly duping a man from Hyderabad of Rs. 2.17 crore by promising to make him chairman of Pharmaexcil,

బీజేపి జాతీయ ప్రధానకార్యదర్శిపై చీటింగ్ కేసు..

Posted: 03/27/2019 07:04 PM IST
Police register cheating case against bjp national general secretary

సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. అవినీతి అక్రమాలకు తావు లేకుండా దేశంలో తమ ప్రభుత్వం పాలనను అందిస్తుందని ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీకి చెందిన జాతీయ కీలక నేతపై చీటింగ్ కేసు నమోదు కావడం సర్వత్రా చర్యనీయాంశంగా మారింది. తెలంగాణ నుంచి బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన పి.మురళీధర్ రావుతో పాటు మరో ఎనిమిది మందిపై రాచకోండ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసం చేశారన్న ఆరోపణలతో ఆయన మీద కేసు పెట్టారు. రూ.2.17 కోట్లకు ఆ రియల్టర్‌ను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు మహిపాల్ రెడ్డి భార్య ప్రవర్ణ రెడ్డి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల ప్రకారం మురళీధర్ రావు మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఫార్మా ఎగ్జిల్ చైర్మన్ పదవిని ఇస్తామని ఆశ చూపించి మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి వద్ద మురళీధర్ రావు రూ.2.17 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మహిపాల్ రెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని కూడా నిందితులు ఫోర్జరీ చేశారని, ఆమె పేరుతో అపాయింట్ మెంట్ లెటర్ ను కూడా సృష్టించారని ఫిర్యాదు చేశారు. దీంతో మురళీధర్ రావుతో పాటు మరో ఎనిమింది మంది నిందితులపై చీటింగ్, ఫోర్జరీ, ఉద్దేశపూర్వక కుట్ర వంటి కేసులను నమోదు చేశారు రాచకోండ కమీషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసులు.

కాగా, ఈ కేసుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మురళీధర్ రావు తెలిపారు. ఆ ఫిర్యాదులో ఉన్నవన్నీ నిరాధారమైనవని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి, తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద తాను 2016 ఆగస్ట్ 24న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినట్టు ఓ ట్వీట్‌లో తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో కూడా బీజేపీ నేతలు దీనిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muralidhar Rao  cheating case  Rachakonda police  Nirmala Sitharaman  Telangana  politics  

Other Articles