panchumarti anuradha counter on YS sharmila షర్మిల విమర్శలపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..

Tdp star campaigner panchumarti anuradha takes on ys sharmila

panchumarti anuradha strong counter to YSRCP, panchumarti anuradha strong counter to YS sharmila, panchumarti anuradha on Amaravti, panchumarti anuradha on development, panchumarti anuradha YS sharmila, Amaravati, Andhra Pradesh, Politics

TDP star campaigner panchumarti anuradha gives strong counter to YSRCP chief YS Jagan sister YS sharmila, She questions if AP capital Amaravati is not developed why Jagan has taken land investing crores of rupeess.

‘‘అమరావతి అభివృద్ది చూడండీ.. అన్న రాసిచ్చిన స్ర్కిఫ్ట్ కాదు..’’

Posted: 03/25/2019 04:37 PM IST
Tdp star campaigner panchumarti anuradha takes on ys sharmila

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమరావతిలో అభివృద్ధి అనేదే జరగడంలేదని వ్యాఖ్యానించడం షర్మిల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ స్టార్ క్యాంపెయినర్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమరావతిలో ఏం అభివృద్ధి జరగకపోతే మీ అన్న రెండున్నర ఎకరాల్లో వంద గదుల ఇల్లు వందకోట్లు పెట్టి ఎందుకు నిర్మించుకున్నాడని అమె ప్రశ్నించారు. అన్న రాసి ఇచ్చిన స్ర్కిప్టును చదువుతూ ప్రిపేర్ అవుతున్న షర్మిల వాటిని సభల్లో ప్రసింగించే ముందు క్షేత్రస్థాయిలో నిజాలను చూసిరావాలని అనురాధ చురకలంటించారు.

ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పంచమర్తి అనురాద.. షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతికి పరిశ్రమలు ఏవీ రాలేదని విమర్శిస్తున్న అమెకు అవగాహనారిహిత్యమేనని అన్నారు. కియా మోటార్స్ మీకు కనిపించడంలేదా? అశోక్ లేలాండ్ మీకు కనిపించడం లేదా? ఫాక్స్ కాన్ సెల్ కంపెనీలు మీకు కనిపించడంలేదా? ఏషియన్ పెయింట్స్ మీకు కనిపించడంలేదా? మీ తండ్రి హయాంలో లంచాలు ఇచ్చుకోలేక కంపెనీలు తమిళనాడుకు తరలిపోయాయి. వాటిలో వోక్స్ వాగన్ కూడా ఒకటని అమె అరోపించారు.

రైతుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. మీ హయాంలో అన్నీ బాగుంటే 14 వేల మంది ఎందుకు ప్రాణాలు విడిచారు? ఎందుకు పవర్ హాలీడే, క్రాప్ హాలీడే ప్రకటించారు? మరి ఈ రోజు రూ.24,000 కోట్ల రూపాయలు చంద్రబాబునాయుడు గారు రైతు రుణమాఫీ చేశారు. 2014లో జగన్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెబితే, దాన్ని సాధ్యం చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు. హత్యారాజకీయాలకు మీ కుటుంబం పెట్టింది పేరని.. అయితే మీరు హత్యారాజకీయాలంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.

వెంకట నరసయ్య అనే చేనేత కార్మికుడ్ని చంపించింది మీ తాత రాజారెడ్డి కాదా? పరిటాల రవి ఆత్మీయులను వేలమందిని పొట్టనబెట్టుకుంది మీ వాళ్లు కాదా? వేల మంది పసుపుకుంకుమలు నేలరాసిన మీకు ఇవాళ పసుపుకుంకుమల గురించి మాట్లాడే నైతిక అర్హతలేదని అమె విరుచుకుపడ్డారు. 'టీడీపీ, జనసేన' బంధం అంటూ మాట్లాడుతున్న మీరు అందుకు ఆధారాలు చూపించగలరా? కాఫీలు, టీలు తాగుతూ కేటీఆర్ తో చర్చలు జరిపింది మీ అన్నే. తెలంగాణ నుంచి పంపించిన ప్రచార రథాలకు రంగులైతే మార్పించారు కానీ గులాబీ రంగులో ఉన్న సీటు కవర్ ను మాత్రం అలాగే వదిలేశారు. అలాంటి మీరు మాపై ఆరోపణలు చేయడమా!" అంటూ అనురాధ నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panchumarti Anuradha  YS sharmila  Amaravati  Andhra Pradesh  Politics  

Other Articles