nama nageswara rao joins trs party టీఆర్ఎస్ లో చేరిన నామా.. ఖమ్మం నుంచి బరిలోకి..

Nama nageswara rao joins trs party set to contest for khamman lok sabha

nama nageswara rao KTR, nama nageswara rao CM KCR, nama nageswara rao TRS, nama nageswara rao Khammam, nama nageswara rao Khammam lok sabha, nama nageswara rao, TRS, Khammam, parliamentary elections, Telangana, politics

Telangana senior TDP leader, Former Member of Parliament Nama NageshwarRao joins Ruling party of Telangana TRS and sets to contest as TRS candidate from Khamman Lok sabha constituency.

టీఆర్ఎస్ లో చేరిన నామా.. ఖమ్మం నుంచి బరిలోకి..

Posted: 03/21/2019 03:43 PM IST
Nama nageswara rao joins trs party set to contest for khamman lok sabha

పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా నామా కారెక్కారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన్ని ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి తాను అధికార పార్టీలో చేరినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మొదటి ఓటు వేసింది తాననని చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రజలకు అన్ని విధాల మేలు చేకూర్చేలా పని చేస్తానన్నారు నామా. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు అమలు కావాలని తాను కలలు కనడం జరిగిందని అవన్నీ ఇప్పుడు అధికార ప్రభుత్వ సమకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను, కృషిని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు.

ఐదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాబోయే సమయంలో తమ నాయకుడిగా అండగా.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా బంగారు తెలంగాణకు కట్టుబడి పనిచేస్తానని నామా నాగేశ్వరరావు అన్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా పేరు దాదాపు ఖరారైందని ఈ చేరికతో తెలిసిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nama nageswara rao  KCR  KTR  Khammam  lok sabha seat  Telangana  politics  

Other Articles