janasena tickets to agri labour son and rtc conductor son వ్యవసాయ కూలి, అర్టీసీ కండక్టర్ కొడుకులకు జనసేన టికెట్లు

Janasena tickets to agri labour son and rtc conductor son

pawan kalyan, janasena, vizianagaram, parvathipuram, srikakulam, pathapatnam, gedala chaitanya, gowri shankar, pawan kalyan gedala chaitanya, pawan kalyan gowri shankar, janasena gedala chaitanya, janasena gowri shankar, janasena parvathipuram, janasena pathapatnam, vizianagaram, parvathipuram, srikakulam, pathapatnam, gedala chaitanya, gowri shankar,andhra pradesh, politics

Jana sena party chief pawan kalyan allocates vizianagaram district parvathipuram ticket to agriculture labour son gowri shanker and srikakulam pathapatnam ticket to retired apsrtc conductor son gedala chaitanya, which is a sign for change in politics.

వ్యవసాయ కూలి, అర్టీసీ కండక్టర్ కొడుకులకు జనసేన టికెట్లు

Posted: 03/21/2019 02:51 PM IST
Janasena tickets to agri labour son and rtc conductor son

జ‌న‌సేన పార్టీ నుంచి బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్ధుల ఐదో జాబితాలలో వినూత్న శైలిని కనబర్చారు జనసేనాని పవన్ కల్యాణ్. అధికారమే పరమావధిగా అన్ని పార్టీలో లె్క్కలు వేసుకుంటూ.. ప్రతీ స్థానంలోనూ అటు అంగబలం, ఇటు అర్థబలంతో పాటు సామాజిక సమీకరణలు సరిచూసుకుంటూ బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతూ అన్ని రాజకీయ పార్టీలు ముందుకుసాగుతున్న క్రమంలో.. తాను ఓట్ల కోసం కాదు.. సీట్ల కోసం కాదు.. అధికారం కోసం అసలే కాదు అని అది నుంచి పిలుపునిస్తున్న జనసేనాని మార్పుల కోసం అంటూ నినదిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో తాను అశించిన మార్పులో భాగంగా విద్యావేత్తలకు, సామాజిక వేత్తలకు, విద్యావంతులకు, మహిళలకు అధికస్థానాలను కేటాయించిన పవన్.. అధికంగా మధ్యతరగతి వర్గాలకు చెందినవారికే టికెట్లను కేటాయించారు. నాలుగు జాబితాల్లో 90 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. తాజాగా తన ఐదవ జాబితాలోనూ ను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తంగా 16 మందికి టికెట్లను కేటాయించగా, అందులో సామాన్య రైతు కూలికి, మాజీ అర్టీసీ కండక్టర్ తనయులకు కూడా టికెట్లు కేటాయించి పవన్ అంటే ఏంటో మరోమారు చాటుకున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం టిక్కెట్‌ను గొంగడ గౌరీ శంకరరావు అనే యువకుడికి ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరీ గౌరీశంకరరావు అనుకుంటున్నారా? ఆయన ఓ సామాన్య రైతు కూలీ బిడ్డ. గౌరీ శంకరరావు తండ్రి గుంపస్వామి వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా, తల్లి అప్పాయమ్మ కూరగాయలు అమ్ముతోంది. తొలి నుంచీ జనసేన పార్టీలో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించిన పవన్.. గౌరీశంకరరావుకు టిక్కెట్ కేటాయించారు.

పవన్ నిర్ణయంపై ఆయన అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్‌ను కూడా పవన్ తన అభిమాని గేదెల చైతన్య అనే యువకుడికి కేటాయించారు. రిటైర్ట్ ఆర్టీసీ కండక్టర్ కొడుకైన చైతన్య సీఎ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన సమయంలో చైతన్య ఆయనకు అన్నివిధాలా అండగా నిలిచారు. దీంతో పవన్ పాతపట్నం టిక్కెట్‌ను చైతన్యకు కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles