TRS and BJP operation akarsh continues.. కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్, బీజేపి గాలం..?

Trs and bjp operation akarsh continues tension in congress

TRS operation akarsh, BJP operation akarsh, TRS traps Congress leaders, BJP traps Congress leaders, sunita lakshma reddy, kommuri pratap reddy, shivakumar reddy, narsapur, narayanpet, MLA to join TRS, Lok sabha Elections, defection of MLA, KCR harsha vardhan reddy, kollapur MLA, KTR, KCR, Telangana CM, Congress, Telangana, politics

Rumours doing rounds in political circles of Telangana that Central and state ruling parties attracts Telangana popular Leaders. In the list hearing about kommuri pratap reddy, shivakumar reddy, sunitha lakshma reddy and former minister Jana reddy son.

ఆ నలుగురు కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్, బీజేపి గాలం..?

Posted: 03/20/2019 08:46 PM IST
Trs and bjp operation akarsh continues tension in congress

కర్ణాటకలో పారని బీజేపి ఆకర్ష్ పాచిక.. తెలంగాణలో మాత్రం సాధ్యమైందా.? అంటే ఔనన్న సంకేతాలే వినబడుతున్నాయి. ఇక అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతామని చెప్పిన టీఆర్ఎస్.. తొలి పర్యాయంలో అవలంభించిన వలసలను రెండో పర్యాయం మరింత జోరు పెంచి.. అధికార పగ్గాలను మరోమారు అందుకున్న వెంటనే అందుకుంది. తొలిసారి టీడీపీ నేతలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. ఇక ఈ పర్యాయం కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసింది.

గత ఎన్నికలలో వచ్చిన అత్తెసరు మెజారిటీతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి అహ్వానిస్తున్నామని కూడా చెప్పారు. నాలుగేళ్ల పాటు ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవిని కట్టబెట్టి మరీ తన పైచేయి సాధించారు. అయితే రెండో పర్యాయం మొత్తం అసెంబ్లీలోని 119 స్థానాల్లో 90 స్థానాలతో పటిష్టంగా వున్నా.. ఎందుకు ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయన్న విషయంలో మాత్రం ఇంకా సీఎం స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలావుంటూ మరోవైపు తెలంగాణలో సత్తా చాటాలని పలు యత్నాలు చేసి విఫలమైన బీజేపి.. ఎంపీ ఎన్నికలలోనైన బలం చాటుకొవాలని ప్రయత్నిస్తొంది. ఈ క్రమంలో తెలంగాణలో సీనియర్ నేతల ఫిరాయింపులు కూడా అధికమవుతుంది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్న ఈ పరిణామాలు.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని టెన్షన్ లో పడవేస్తున్నాయి. ఏ రోజు, ఎవరు వెళ్లిపోతారా అని కాంగ్రెస్ నాయకత్వం మదనపడిపోతుంది. డీకే అరుణ బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే మరో  ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే గులాబీ ఆకర్ష్ తో డీలాపడ్డ హస్తం పార్టీ.. బీజేపీ ఆకర్ష్ తో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. డీకే అరుణ నిష్క్రమణతో కాంగ్రెస్‌ నేతలు షాక్ కు గురయ్యారు. తాజాగా మరో నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలపై కూడా బీజేపి గాలం వేసిందన్న వార్తలు వినబడుతున్నాయి. మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డికి అటు బీజేపి, ఇటు టీఆర్ఎస్ పార్టీలు గాలం వేశాయన్న వార్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అందోళనకు గురిచేస్తున్నాయి.

మెదక్ పార్లమెంటు స్థానం నుంచి అమెను బరిలోకి దిగమని ఈ రెండు పార్టీలు అమెకు ఆఫర్ ఇచ్చాయి. అయితే అమె ఈ విషయమై ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో వున్నారని తెలుస్తుంది. ఇక మరోవైపు నారాయణపేట్ కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డిని కూడా బీజేపిలోకి వచ్చి మహబూబ్ నగర్ పార్లమెంటరీ అఫర్ కూడా ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. చెర్యాల కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కూడా తమ పార్టీలోకి రావాలని అహ్వానించారని సమాచారం.

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణతో కూడా చర్చలు జరిగాయని ఆయన మలక్ పేట్ నియోజకవర్గం కావాలని షరతు పెట్టడంతో బీజేపి హామీ ఇవ్వలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎప్పుడు ఏ నేత పార్టీ వీడతారో...తెలియక సతమతమవుతోంది. ఓవైపు కారు,  మరోవైపు కమలం తమ పార్టీ నేతలను లాక్కుంటుంటే హస్తం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunita lakshma reddy  kommuri pratap reddy  shivakumar reddy  TRS  BJP  Congress  Telangana  politics  

Other Articles