No bail to Nirav Modi remanded in UK లండన్ ఊచలు లెక్కెబెడుతున్న నిరవ్ మోడీ..

Irav modi arrested in uk court remands him in custody till march 29

Nirav Modi, Mehul Choksi, Westminster court, london court, PNB scam, politics, Indian news

Nirav Modi, the main accused in the USD 2 billion PNB scam case, has been arrested in London where a court remanded the fugitive diamantaire in custody till March 29.

లండన్ ఊచలు లెక్కబెడుతున్న నిరవ్ మోడీ..

Posted: 03/20/2019 06:12 PM IST
Irav modi arrested in uk court remands him in custody till march 29

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆయనను 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

నిరవ్ మోడీకి ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేస్తే నీరవ్.. ఆయన తిరిగి సరెండర్ అవతారని విశ్వాసం లేకపోవడంతోనే నిరవ్ బెయిల్ ను జడ్జి నిరాకరించారు.ఈ కేసులో తన వాదనలు వినిపేంచేందుకు నీరవ్ కోర్టుని కోరినట్లు తెలుస్తోంది. పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వస్తుందని ముందే గ్రహించి స్కామ్ బయటపడకముందే దేశం వదిలి పారిపోయి లండన్ లో నివసిస్తున్న నీరవ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లండన్ లో విలాసవంత జీవితం గడుపుతూ గెటప్ మార్చి రోడ్లపై దర్జాగా తిరుగుతున్న నీరవ్ స్థానిక రిపోర్టర్ కంటపడ్డాడు.

నీరవ్ ని గుర్తించిన ఆ జర్నలిస్ట్ నీరవ్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే నో కామెంట్స్ అంటూ నీరవ్ అక్కడినుంచి జారుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారత అధికారుల ఒత్తిడితో మంగళవారం నీరవ్ ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నీరవ్ భారత్ కు ఎప్పుడు తిరిగివస్తాడన్నదానిపై క్లారిటీ లేదు.నీరవ్ కన్నా ముందు దేశం నుండి పారిపోయి లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యానే ఇప్పటివరకు దేశానికి రాలేదు.ఇక నీరవ్ వచ్చేసరికి చాలా టైం పట్టే అవకాశమన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirav Modi  Mehul Choksi  Westminster court  london court  PNB scam  politics  Indian news  

Other Articles