Governor flags off Ameerpet to Hi-Tec City metro rail నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో మైట్రో సేవలు ప్రారంభం

Esl narasimhan inaugurates ameerpet hitech city metro line

ESL Narsimhan, Governor, Metro Train service, Ameerpet to Hi-Tec City, Metro Train, Hyderabad, Telangana

Governor ESL Narsimhan is seen flagging off the Metro Train service from Ameerpet to Hitech City.

నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో మైట్రో సేవలు ప్రారంభం

Posted: 03/20/2019 03:38 PM IST
Esl narasimhan inaugurates ameerpet hitech city metro line

నాగోల్ నుంచి హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గం మెట్రో రైలు సర్వీసులు పట్టాలెక్కాయి. ఇప్పటి వరకు కేవలం అమీర్ పేట్ వరకు మాత్రమే అందుబాటులో వున్న సర్వీసులు ఇకపై హైటెక్ సిటీ‌ వరకు సాగనున్నాయి. ఇవాళ అమీర్ పేట్  హైటెక్ సిటీ మార్గంలోని మెట్రో రైల్‌ ను అమీర్ పేట స్టేషన్ లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌ గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ మార్గంలోని ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రూట్ లోనూ ప్రయాణించేందుకు నగరవాసులు ఉవ్విళ్లూరుతున్నారు. అటు సాధారణ ప్రయాణికులతో పాటు ఇటు సాప్ట్ వేర్ ఉద్యోగులు కూడా ప్రయాణం కోసం పోటీ పడుతున్నారు. దీంతో నాగోల్ నుండి శిల్పారామం వరకు ఉన్న కారిడార్ 3 మొత్తం 27 కిలో మీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ కారిడార్‌లో ఇప్పటికే నాగోల్ నుండి అమీర్‌పేట్ వరకు సర్వీసులు నడుస్తుండగా... ఇప్పుడు అమీర్‌పేట్ నుంచి శిల్పారామం వరకు మెట్రో సర్వీసులు పొడిగించనున్నారు.

అమీర్‌పేట్‌-హైటెక్ సిటీ మధ్య దూరం 10 కిలో మీటర్లు. ఈ మార్గంలో మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉండగా... ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ మెట్రో స్టేషన్ల మెట్రో రైలు ఆగదు. కొన్ని వారాల తర్వాత ఈ మూడు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles