Naga Babu to contest for a Lok Sabha seat జనసేనలోకి నాగబాబు.. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ..

Naga babu joins janasena set to contest for a lok sabha seat

pawan kalyan, janasena, Pawan Kalyan Mega brother, Pawan Kalyan Naga babu, Nagababu JanaSena, Nagababu Narsapuram, narsapuram parliamentary constituency, andhra pradesh, politics

The political temperatures in the state seem to be on the rise with each passing day. Different political parties have been busy chalking out strategies to field the right candidates in the upcoming Assembly and Lok Sabha polls.

జనసేనలోకి నాగబాబు.. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ..

Posted: 03/20/2019 01:44 PM IST
Naga babu joins janasena set to contest for a lok sabha seat

జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చేశారు. ఇన్నాళ్లు తెర వెనక ఉండి సపోర్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరి జనసైనికులకు మరింత ఉత్తేజాన్ని నింపారు. జనసేన పార్టీ తరపున ఆయన కూడా ఈ ఎన్నికల్లోనే బరిలోకి దిగనున్నారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది పార్టీ.

జనసేన పార్టీలో నాగబాబు ఎంట్రీతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి పోటీకి కూడా దిగుతుండటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది. నరసాపురం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున బీవీ శివరాంరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రఘురాం కృష్ణంరాజు బరిలో ఉన్నారు. వీళ్లతో నాగబాబు ఢీకొట్టనున్నారు. నరసాపురం నుంచి కొణిదెల నాగబాబు పోటీతో.. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది.

ఇక అటు వైసీని నుంచి ఇటు జనసేన నుంచి ఇద్దరు ప్రజాదరణ కలిగిన నేతలు ఎన్నికల సమరాంగనంలోకి దిగనుంటడంతో.. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరాంగనంలోకి దిగుతున్న నాగబాబు.. జనసేన జెండాను ఎగరేస్తారా లేదా అనేది ఇంట్రస్టింగ్ డిస్కషన్ అయ్యింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nagababu  mega brother  narsapuram  andhra pradesh  politics  

Other Articles