vijayamma, sharmila to campaign for YCP జగన్ కు తోడుగా ఎన్నికల ప్రచారానికి విజయమ్మ, షర్మిల

Vijayamma sharmila to campaign for ycp in ap assembly elctions

vijayamma to campaign for YCP, Sharmila to campaign for YCP, vijayamma, sharmila, election campaign, mangalagiri, Road Show, Rayalaseema, Kadapa MP, Assembly Elections, Lok sabha Election, Andhra Pradesh, AP Poiitics

YS vijayamma, and YS Sharmila both adjoining the president of YSRCParty YS Jagan in Election campaign, YS sharmila to start campaign from mangalagiri from 27th and will cover nearily 50 constituencies.

జగన్ కు తోడుగా ఎన్నికల ప్రచారానికి విజయమ్మ, షర్మిల

Posted: 03/19/2019 04:22 PM IST
Vijayamma sharmila to campaign for ycp in ap assembly elctions

బిడ్డతో తల్లే చెప్పెను నేనున్నానని.. అన్నతో చెల్లే చెప్పెను నేనున్నానని.. ఇదెక్కడో విన్న పాటలాగానే వున్నా.. చరణాలు మాత్రం ఇవి కాదు అనిపిస్తోందా..? రాష్ట్రంలో ఓ వైపు భానుడి తాపం మాడు పగలగొడుతున్నా.. మరోవైపు ఎన్నికల ప్రచారహోరుతో మరింత వేడిని రాజుస్తున్నాయి ఎన్నికలు. రాష్ట్ర అసెంబ్లీకి, లోక్ సభకు వచ్చిన ఎన్నికలలో జగన్ పాదయాత్ర తరువాత మళ్లి బస్సుయాత్రను చేపట్టారు. పార్టీ విజయం కోసం ఆయన పడుతున్న శ్రమను పంచుకునేందుకు రంగంలోకి దిగనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల.

వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్ద‌రూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు నాలుగు స‌భ‌లు నిర్వహించేందుకు వైసీపీ పెద్దలు ప్లాన్స్ చేస్తున్నారు. వేర్వేరుగా రెండు బస్సులను సిద్ధం చేస్తున్నారు. 2012లో ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ జైళ్లో ఉండడంతో వీరిద్ద‌రూ ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. అభ్యర్థుల తర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. 2014 ఎన్నిక‌ల స‌మయంలోనూ ఎలక్షన్ క్యాంపెయన్ చేశారు విజయమ్మ, షర్మిల.

షర్మిల :
ఉత్తరాంధ్ర నుండి ఇచ్చాపురం వరకు జగన్ సోదరి షర్మిల ప్రచారం చేయనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణ బరిలో ఉన్న నేపథ్యంలో షర్మిల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణకు కొంత కలసివస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి షర్మిల అన్నకు మద్దతుగా, తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రచారబరిలోకి దిగనుంది. 10 జిల్లాలు గుండా, 50 నియోజకవర్గాల మీదుగా షర్మిల బస్సుయాత్రం సాగనుంది.

విజయమ్మ :
జగన్ తల్లి విజయమ్మ విషయానికి వస్తే...రాయలసీమ నుండి ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. మొత్తం 40 నియోజకవర్గాల్లో ఆమె చేత ప్రచారం చేయించాలని భావిస్తోంది పార్టీ. రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించి పార్టీకి మద్దతుగా ప్రచారం విజయమ్మ ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి జగన్ ప్రచారం స్టార్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో మూడు నుండి నాలుగు సభలు నిర్వహిస్తూ ప్రచార పర్వంలో దూసుకపోతున్నారు జగన్. ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం మాత్రమే ఉంటుంది కనుక..వీలైనన్నీ నియోజకవర్గాలు కవర్ చేయాలని వైసీపీ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles