Nama Nageshwar Rao quits TDP, joins TRS టీడీపీకి నామా రాజీనామా.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీగా బరిలోకి..

Nama nageshwar rao quits tdp to contest for mp lok sabha seat from trs

Telangana TDP senior leader, Nama Nageshwar Rao quits TDP party, Nama Nageshwar Rao TDP polit bureau member, Nama Nageshwar Rao Khammam lok sabha, Nama Nageshwar Rao to join TRS party, Nama Nageshwar Rao, khammam lok sabha, TDP, TRS, Chandrababu, Telangana, Telangana Politics

Telangana TDP senior leader and former MP Nama Nageshwar Rao quits TDP party and for his polit bureau post. It is heard that he will contest for Khammam lok sabha from Ruling TRS party.

టీడీపీకి నామా నాగేశ్వరావు రాజీనామా.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీగా బరిలోకి..

Posted: 03/19/2019 02:39 PM IST
Nama nageshwar rao quits tdp to contest for mp lok sabha seat from trs

తెలంగాణ టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీకి షాకిచ్చారు. మూడు మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో టీడీపీ తరుపున బరిలో నిలిచిన ఆ నేత.. తాజాగా ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఈ సారి గెలుపే లక్ష్యంగా అధికార పార్టీలో చేరనున్నారు.

ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అంతకుముందే ఆయన తన టీడీపీ పార్టీకి, పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు గెలుపుపై అనేక అశలు పెట్టుకున్నా.. అవి ఫలించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

అప్పటి నుంచి పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో తెదేపాకు మనుగడ లేదని భావించిన ఆయన అటు కాంగ్రెస్‌లో గానీ, తెరాసలో గానీ చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన తెరాస అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోనూ భేటీ అయ్యారు. దీంతో ఇక ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం ఎంపీగా ఆయనను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ యోచిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nama Nageshwar Rao  khammam lok sabha  TDP  TRS  Chandrababu  Telangana  Politics  

Other Articles