YSRCP MLA Isaiah to join TDP కర్నూలు టీడీపీ చేరికల కోలాహలం..

Ysrcp mla isaiah byreddy rajasekhar reddy to join tdp

Byreddy Rajasekhar Reddy, MLA YIsaiah, Gouru charitha reddy, kotla suryaprakash reddy, Jagan Hunting, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSR Congress Party, TDP, Nandikotkur, Andhra pradesh, AP Politics

After YSRCP party President YS Jagan Mohan Reddy announces, AuThar as nandikotkur MLA canditate, the sitiing MLA yisaiah is in touch with TDP leaders and willing to join TDP.

కర్నూలు టీడీపీ చేరికల కోలాహలం.. బైరెడ్డి, ఐజయ్యలతో బలోపేతం

Posted: 03/19/2019 12:54 PM IST
Ysrcp mla isaiah byreddy rajasekhar reddy to join tdp

కర్నూల్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతొంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అధిష్టానానికి షాక్‌ ఇస్తున్నారు. ఆ పార్టీ నందికొట్నూరు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎక్కదేవి ఐజయ్య పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ఆశించిన ఐజయ్యకు వైసీపీ అధిష్ఠానం టిక్కెట్ ను నిరాకరించింది. దీంతో అధిష్టానం పునారాలోచించుకుంటుందని వేచిచూసిన ఆయన.. ప్రయత్నాలు విఫలమయ్యాయి.

దీంతో ఆయన వైసీపీ పార్టీకి వీడే అలోచనలో వున్నారు. ఆయనకు టిక్కెట్టు నిరాకరించి వైసీపీ అధిష్టానం.. మరో అభ్యర్థిని ప్రకటించడంతో ఇక తాడో పేడో తేల్చుకున్న ఐజయ్య తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారని, అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు.

కోడుమూరు ఎమ్మెల్యే మురళి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఐజయ్య కూడా వెళ్లిపోతే వైసీపీకి పట్టుతప్పినట్లే అవుతుంది. కాగా వైసీపీ ఐజయ్య స్థానంలో రిటైర్డు పోలీసు అధికారి తొగురు ఆర్థర్ కు సీటు కేటాయించిన విషయం తెలిపిందే. దీన్ని అవమానంగా భావిస్తున్న ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి తోడు బైరెడ్డి రాజశేఖర్ రె్డి కూడా తన సొంతపార్టీకి తిరిగి రానున్నారు. గౌరు దంపతులు కూడా టీడీపీ గూటికి చేర తరుణంలో కర్నూలు జిల్లాలో టీడీపీ బలంగా తయారైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles