Goa CM Manohar Parrikar last rites to be held today పారికర్ కడసారి చూపుకోసం బారులు తీరిన అభిమానులు

Goa cm manohar parrikar the man who won many battles succumbs to illness

manohar parrikar,Manohar Parrikar passed away,Manohar Parrikar death,manohar parrikar dies,Manohar Parrikar Last rites, Manohar Parrikar final journey, Manohar Parrikar demise, Manohar Parrikar funeral, Laxmikant Parsekar,BJP,Goa CM,Former defence minister, politics

Goa chief minister Manohar Gopalakrishna Prabhu Parrikar died in the midst of his fourth term in office. The 63-year-old widower, also former defence minister of India, is survived by two sons and a grandchild.

మనోహర్ పారికర్ కడసారి చూపుకోసం బారులు తీరిన అభిమానులు

Posted: 03/18/2019 12:02 PM IST
Goa cm manohar parrikar the man who won many battles succumbs to illness

అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి  మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ… రక్షణశాఖను కోరింది. మిరామర్‌ బీచ్‌లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్‌ బండోద్కర్‌ స్మారకం పక్కనే పారికర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు.  మనోహర్‌ పారికర్‌ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా... పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కడసారి చూపుకోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు బారులు తీరారు.

ఆ తర్వాత పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకుని వెళ్ళారు. సాయంత్రం 4 గంటల వరకు కళా అకాడమీలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచుతారు.  సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంతిమయాత్ర కొనసాగుతుందని ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని బీజేపి నేతలు తెలిపారు. పారికర్‌ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.

పారికర్ మృతికి సంతాప సూచకంగా  ఇవాళ జాతీయ సంతాప దినాన్ని కేంద్రం  పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను అవనతం  చేశారు.  గోవాకు 3 సార్లు సీఎం గా పని చేసిన మనోహర్ పారికర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి గోవాలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి పారికర్ మాత్రమే కావాలంటూ అక్కడి భాగస్వామ్య పార్టీలు కోరడంతో.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. గోవా ముఖ్యమంత్రిగా మరోమారు బాద్యతలు చేపట్టారు. గతేడాది మార్చిలో  క్లోమగ్రంధి కేన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ  ఆదివారం మార్చి 17, 2019న  తుది శ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manohar parrikar  Laxmikant Parsekar  BJP  Goa CM  Former defence minister  politics  

Other Articles