IRCTC Ticket Cancellation Rules and Charges ఐఆర్సీటీసీ కొత్త రీఫండ్ రూల్స్ ఇవే...

Indian railways ticket cancellation rules charges and other details

irctc refund rules 2018, irctc refund rules 2019, irctc refund rules, how to get refund on cancelled ticket, irctc helpline no for refund, irctc failed transaction refund rules, irctc ticket refund status, irctc customer care number for refund

IRCTC handles the catering, tourism and online ticketing operations of the Indian Railways, also offers the option of ticket cancellation. Once the cancellation is confirmed, the refund is credited back to the account used for booking of the ticket.

రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? ఐఆర్సీటీసీ కొత్త రీఫండ్ రూల్స్ ఇవే...

Posted: 03/16/2019 07:11 PM IST
Indian railways ticket cancellation rules charges and other details

మీరెప్పుడైనా చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకొని రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారా? టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారా? మీకే కాదు... చాలామందికి ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేయడం ఓ పెద్ద సవాల్ అయితే... టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ పొందడం అంతకంటే పెద్ద సవాల్. పలుమార్లు టిక్కెట్ క్యాన్సిల్ అయినా డబ్బు తిరిగిపోందలేక చాలా మందే డబ్బులు పొగోట్టుకున్నారు.

చాలామందికి టికెట్ క్యాన్సిలేషన్ నియమనిబంధనలు తెలియక డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ వీడియో విడుదల చేశారు. టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ వివరించారు. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు నష్టపోకుండా చైతన్యపరుస్తోంది రైల్వే శాఖ. టికెట్ క్యాన్సలేషన్ విషయంలో రైల్వే శాఖ నియమనిబంధనలు ఇవే.

రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే...

ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లపై రూ.240 కోత
2 ఏసీ/ఫస్ట్ క్లాస్ టికెట్లపై రూ.200 కోత
3 ఏసీ/ఏసీ చైర్ కార్/3ఏసీ ఎకనమీ క్లాస్ టికెట్లపై రూ.180 కోత

రైలు బయల్దేరడానికి 48 నుంచి 12 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...

రిజర్వ్‌డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 25 శాతం కోత
రైలు బయల్దేరడానికి 12 నుంచి 6 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...
రిజర్వ్‌డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 50 శాతం కోత

తత్కాల్ టికెట్ల క్యాన్సిలేషన్

తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. ఒకవేళ రైలు 3 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసిప్ట్(TDR) ఫైల్ చేసి రీఫండ్ పొందొచ్చు.

టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?

మొదట IRCTC వెబ్‌సైట్‌లో లాగిన్ చేయాలి.
‘my account’లో ‘my transaction’ పేజీలోకి వెళ్లాలి.
‘file TDR’ ఆప్షన్ ఎంచుకోవాలి.
టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో కారణం చెప్పాలి.
‘file TDR’ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఒకవేళ కౌంటర్‌లో టికెట్ బుక్ చేసినట్టైతే పీఎన్ఆర్ నెంబర్, ప్రయాణికుల వివరాలతో టీడీఆర్ ఫామ్ పూర్తి చేసి రీఫండ్ పొందొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irctc  ticket refund rules  ticket cancellation  irctc failed transactions  piyush goyal  

Other Articles