Mantralayam TDP Thikka Reddy injured in shootout తిక్కారెడ్డి తొడలో బుల్లెట్ ఎలా వెళ్లింది..?

Mantralayam tdp mla thikka reddy gunman opens fire during campaign

TDP, Mantralayam MLA, TDP candidate, Tikka Reddy, Bala Nagireddy, YCP MLA Candidate, Mantralayam shootout, kurnool shootout, MLA candidates shootput in Andhra Pradesh, tdp vs ysrcp

A Telugu Desam Party (TDP) MLA candidate got injured in an election campaign in Kaggalu, Mantralayam. Thikka Reddy the MLA candidate from the TDP for the constituency of Mantralayam, was in Kaggalu village, campaigning for the upcoming elections.

తిక్కారెడ్డి తొడలో బుల్లెట్ ఎలా వెళ్లింది..?

Posted: 03/16/2019 05:23 PM IST
Mantralayam tdp mla thikka reddy gunman opens fire during campaign

రాష్ట్ర అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు కూడా వచ్చే నెల 11న జరగనున్న నేపథ్యంలో అప్పుడే అభ్యర్థుల ప్రచారం పర్వంతో పాటు ఘర్షణల పర్వం కూడా ప్రారంభమైంది. అంతేకాదు కర్నూలు జిల్లాలో ఏకంగా అభ్యర్థులు కాల్పులు కూడా జరుపించడం కూడా ప్రారంభమై.. హింసాత్మక ఘటనలు కూడా నమోదు చేసుకుంటున్నాయి. ఇప్పుడే రాజకీయ గొడవలు తారాస్థాయికి వెళ్తే.. ఇక ఏప్రిల్ 11 వరకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోన్న అందోళన కూడా రాష్ట్రవాసుల్లో రేకెత్తుతుంది.

కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తిక్కారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కు గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలానాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి పర్యటించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఆ కార్యక్రమాన్ని వైసీపీ వర్గీయులు అడ్డుకొని.. టీడీపీ జెండాను తొలగించినట్లు సమాచారం. అంతేకాదు ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిక్కారెడ్డి గన్ మెన్ కాల్పులు జరిపినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారగా మోహరించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తనపై దాడి జరగడంపై స్పందించిన టీడీపీ నేత తిక్కారెడ్డి.. బాలనాగిరెడ్డి కుటుంబమే తనపై కాల్పులు జరిపించిందని ఆరోపించారు. ఈ దాడి జరుగుతుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బాలనాగిరెడ్డి కుటుంబం తనతో గొడవకు దిగిందని స్పష్టం చేశారు. ఖగ్గల్ లో ప్రచారానికి వెళుతున్న విషయాన్ని తాను కర్నూలు ఎస్పీకి ముందుగానే తెలిపానని వ్యాఖ్యానించారు. అయినా తనకు తగిన రక్షణ కల్పించలేదనీ అరోపించారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఖగ్గల్ లో జరిగిన ఘటన నేపథ్యంలో తాను వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఎంతమంది బాలనాగిరెడ్డిలు వచ్చినా.. అడ్డకున్నా.. తాను వైద్యం చేసుకుని తిరగి వచ్చి ప్రచారం చేస్తానని తిక్కారెడ్డి తెలిపారు. తమ పార్టీకి ఈ సారి మంత్రాలయంలో గెలుస్తుందన్న అక్కస్సుతోనే బాలనాగిరెడ్డి దాడులకు తెగబడుతున్నారని, ఆయన ఆరాచకాలకు కూడా అడ్డులేకుండా పోయిందని తిక్కారెడ్డి విమర్శించారు.

కాగా, బాలనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోడ్‌ అమల్లో ఉండగా జెండా ఆవిష్కరణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని బాలనాగిరెడ్డి ఆరోపించారు. మా వాళ్ల దగ్గర తుపాకులు లేవని తెలిపారు. తుపాకులు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తతలకు టీడీపీనే కారణమని విమర్శించారు. మరోవైపు బాలనాగిరెడ్డి వర్గీయులు దాడిచేయడాన్ని వ్యతిరేకిస్తూ తిక్కారెడ్డి అనుచరులు మంత్రాలయంలోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Mantralayam MLA  TDP candidate  Tikka Reddy  Bala Nagireddy  YCP MLA  

Other Articles