Chandrababu Revels Unknown Facts in YS Viveka Murder వైఎస్ వివేకా హత్యేపై.. చంద్రబాబు ప్రశ్నలు..

Cm chandrababu revels unknown facts in ys vivekananda reddy demise

YS Jagan, YS Jagan Mohan Reddy, CBI Investigation, CM Chandrababu, YS RajaReddy, YS Vivekananda Reddy murder, YS Vivekananda Reddy brutal murder, YS Vivekananda Reddy killed, Seven stabings on ys vivekananda reddy body, YS Jaganmohan Reddy, Y. S. Rajasekhara Reddy, Kadapa district, jaganmohan reddy, Amaravati, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu revels unknown gacts in YS Vivekananda Reddy Demise. He suspects on how the evidences had been erased, how blood strians been washed off and how letter been present after autopsy report.

ఆధారాలను మాయం చేసేదెవరు.? వివేకా హత్యోదంతంపై చంద్రబాబు

Posted: 03/15/2019 11:13 PM IST
Cm chandrababu revels unknown facts in ys vivekananda reddy demise

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయని అన్నారు. వివేకానందరెడ్డి మరణం వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిందని చెప్పారు చంద్రబాబు. అయితే, ఆయన మరణం ఎంతో అనుమానాస్పదం కావడం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు.

"సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని కానీ, సంఘటన స్థలాన్ని కానీ డిస్టర్బ్ చేయకూడదు. కానీ వివేకా విషయంలో అలా జరగలేదు. గుండెపోటు అని చెప్పి తలకు గుడ్డకట్టారు. ఈ వ్యవహారంలో స్టెప్ బై స్టెప్ ఆధారాలను తారుమారు చేశారు. సీఐ వచ్చేసరికి రక్తపు మరకలన్నీ శుభ్రం చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నప్పుడు పంచనామా చేస్తారని మీకు తెలియదా? ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి డాక్టర్ కు గుండెపోటు అని చెప్పారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... వివేకా మరణం గురించి అవినాష్ రెడ్డికి ఎలా తెలిసింది? ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు?. పీఏ వచ్చేసరికి 5.30 అయింది. 6.40 ప్రాంతంలో అవినాష్ పోలీసులకు ఫోన్ చేశాడు. అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి చేశాడు? ఇక, వివేకాను ఆసుపత్రికి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులందరూ అక్కడికి వెళ్లారు.

మరి హత్య అని మొదటే ఎందుకు చెప్పలేకపోయారు? గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సహజమరణానికి, హార్ట్ అటాక్ కు, హత్యకు తేడా తెలియదా మీకు? అంటే, వాళ్ల మధ్యలోనే ఏదో జరిగింది. గుండెపోటు అని పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. లేఖలో ఉన్న విషయాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. డ్రైవర్ ను త్వరగా రమ్మని పిలిచాను... చంపబోతున్నాడు అని ఉన్నట్టు చెప్పారు. డ్రైవర్ పేరును తీసుకువచ్చారంటే విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

గుండెపోటుతో వివేకా మరణించాలని నమ్మించ సమయంలో కనిపించని లేఖ.. పోస్టుమార్టం నివేదిక తరువాత సహజమరణం కాదని తేలిపోగానే ప్రత్యక్షం కావడం అర్థంకాని విషయం అన్నారు. కొందరు వ్యక్తులు ఈ వ్యవహారంలో కేసు పెట్టాల్సిన అవసరం లేదని అన్నట్టు తెలిసిందని సీఎం పేర్కొన్నారు. అంతదారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. చివరికి తనపైనా, లోకేశ్ పైనా ఆరోపణలు చేయడం మరీ దారుణమని, వివేకా మృతిని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

"మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేసుకోకుండా అందరిపై ఆరోపణలు చేయడం సరికాదు. శవాన్ని ఎవరు బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ కు తరలించారు? మళ్లీ బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ కు ఎవరు తరలించారు? వీటన్నింటికి సమాధానాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తాయి. బయటివాళ్లు చంపితే సాక్ష్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.

ఇంట్లో వాళ్లు చంపినప్పుడే ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. రక్తపు మరకలు ఎందుకు కడిగేయాల్సి వచ్చింది? మెదడు కూడా బయటికి వచ్చేలా గాయం అయితే గుండెపోటు అని ఎలా చెప్పగలిగారు? హార్ట్ అటాక్ అయితే తలలోంచి రక్తం వస్తుందా? ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ అంటున్నారు. నేరాలు చేయడంలో దిట్టలైన వాళ్లే ఇంత పకడ్బందీగా చేస్తారు"  అంటూ విశ్లేషించారు చంద్రబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YS Vivekananda Reddy  CBI Investigation  CM Chandrababu  kadapa  Andhra pradesh  Politics  

Other Articles