TDP Lures Mudragada With MLA Ticket! టీడీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ఎమ్మెల్యే ఆఫర్

Tdp lures mudragada offers mla ticket to his son

Kapu community rights leader, Mudragada Padmanabham, Telugu Desam Party, CM Chandrababu Naidu, Chella Reddy, MLA Ticket, Pitapuram, senior TDP leaders, Kapu JAC leaders, Kirlampudi, East Godavari, Andhra Pradesh, Politics

Kapu strongman and former minister Mudragada Padmanabham is lured by Ruling Telugu Desam Party. Suddenly today CM Chandrababu Naidu deputed a group of senior TDP leaders to Mudragada at his residence in Kirlampudi in East Godavari district and asked him to join the TDP.

ముద్రగడను ఆకర్షిస్తున్న టీడీపీ.. తనయుడికి ఎమ్మెల్యే టికెట్..

Posted: 03/15/2019 09:02 PM IST
Tdp lures mudragada offers mla ticket to his son

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సమావేశం అయినట్టు సమాచారం. టీడీపీలో చేరితే ముద్రగడ పద్మనాభం కుమారుడు చల్లారెడ్డికి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అంశంపై చర్చించినట్టు తెలిసింది. కాపులకు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ హామీలను పట్టించుకోవడం లేదని ఆయన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తమ రిజర్వేషన్లు ఏక్కడా.. అని నినదిస్తూ తునిలో భారీ బహిరంగసభను కాపుగర్జన పేరుతో ఏర్పాటు చేశారు. కాగా తుని ఘలనను కొన్ని సంఘవిద్రోహ శక్తులు విచ్చిన్నం చేయాలని చూశాయి. తుని రైల్వే జంక్షన్ లో వున్న రైలుకు నిప్పుబెట్టాయి.

అయితే ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన అన్ని దీక్షలను టీడీపీ ప్రభుత్వం భగ్నం చేసింది. కిర్లంపూడిలోని ఆయన ఇంటిలోనే ఆయనను గృహనిర్భంధం చేసింది. ముద్రగడ దీక్ష తలపెట్టిన ప్రతీసారి కిర్లంపూడి ప్రాంతం అప్రకటిత కర్ఫ్యూను తలపించింది. పద్మనాభంను అరెస్ట్ చేయడం, ఆయన కుటుంబసభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరకుండా కుమారుడు చల్లారావును మాత్రమే టీడీపీలో చేర్చే అంశం ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఆయనకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకుగాను ఆయన రాష్ట్రమంతా తిరిగి తమ పార్టీ తరుపున ప్రచారం చేయాలని ముద్రగడను కోరినట్టు తెలుస్తుంది. అయితే ముద్రగడ కాపు జేఏసీల విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించారని.. దీంతో మరోసారి మాట్లాడుదామని వారు వెళ్లిపోయినట్టు సమాచారం. మొత్తం మ్మీద ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను పూర్తి స్థాయిలో రాబట్టే దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  TDP  Chandrababu  Chella Reddy  MLA Ticket  Andhra Pradesh  Politics  

Other Articles