pawan kalyan releases janasena manifesto జనసేన మానిఫెస్టో విడుదల చేసిన పవన్..

Pawan kalyan releases janasena manifesto at rajamundry public meet

pawan kalyan, janasena, rajamundry, janasena manifesto, rajamahedravaram, janasena fifth foundation day, janasena formation day, janasena activists, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Actor turned Politician Power Star Pawan Kalyan releases janasena party manifesto at rajamundry public meet today

జనసేన మానిఫెస్టో విడుదల చేసిన పవన్.. అకర్షించే హామీలు

Posted: 03/14/2019 09:36 PM IST
Pawan kalyan releases janasena manifesto at rajamundry public meet

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. ఈ బహిరంగసభకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజలపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ప్రధానంగా రైతుల కోసం ప్రత్యేకమైన పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు.

జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగుల మాదిరి.. 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు రూ. 5వేల ఫించన్లు ఇస్తామని పవన్ ప్రకటించారు. అంతేకాదు ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా సోలార్‌ మోటార్లు అందజేస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన తొలి ఆరునెలల్లో లక్ష ఉద్యోగాలు.. ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు.

జనసేన ఎన్నికల మానిఫెస్టోలో ముఖ్యమైన హామీలివే..

* ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
* ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన
* కేజీ టు పీజీ ఉచిత విద్య
* విద్యార్థులకు డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
* విద్యార్థులకు ఐడీకార్డులతో ఉచిత రావాణా సౌకర్యం
* కులాలకు సంబంధం లేకుండా విద్యార్థులకు కామన్ హాస్టళ్ల ఏర్పాటు
* జిల్లాలకోకటి చోప్పున పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు
* వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం
* ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
* ప్రతీ రైతుకు ఉచితంగా సోలార్ పంపులు
* 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు రూ. 5వేల ఫింఛన్
* రైతులకు పంటభీమా కింద ఏకారానికి సంవత్సారానికి రూ.8 వేలు పం
* బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు
* నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం
* మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు.
* మత్స్యకారులు ప్రకృతి ప్రతికూల సమయాల్లో రోజుకు రూ.500 ఆర్థికసాయం.
* మత్స్యకారులకు సముద్రంలో సూదుర ప్రాంతాలకు వెళ్లేలా జెట్ బోట్ల ఏర్పాటు
* అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా
* చిరు వ్యాపారులకు, తోపు బండ్లవారికి రూ.5 వేల రుణం
* జిల్లాకు పది చోప్పున 130 స్మార్ట్ సిటీలు అభివృద్ధి
* ప్రతి జిల్లాకు మూడు అవకాశాల జోన్లు
* 2013 భూసేకరణ చట్టం ప్రకారమే అభివృద్దికి అవసరమయ్యే భూసేకరణ
* పారశ్రామీకరణలో భూములు కోల్పోయిన వారికి ఆయ సంస్థల్లో భాగస్వామ్యం
* ఉభయగోదావరి జిల్లాల్లో రైతులకు వ్యవసాయ గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు
* ముస్లింల అభ్యున్నతి కోసం సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు
* స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన.
* ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం
* మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు
* డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
* ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
* అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరలతో పాటు బహుమతుల పంపిణీ  
* ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం
* మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు
* మహిళలకు పావలా వడ్డీకే రుణాలు
* బంగారం తాకట్టుపై అర్ధరూపాయి వడ్డీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  janasena manifesto  fifth formation day  andhra pradesh  politics  

Other Articles