narendra hot comments on vangaveeti radha krishna వంగవీటి రాధాపై నరేంద్ర ఘాటు విమర్శలు

Narendra hot comments on vangaveeti radha krishna

vangaveeti radha krishna, vangaveeri narendra, vangaveeti narayana rao, vangaveeti ratna kumari, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Lagadapati Rajagopal, machilipatnam, vijayawada, Andhra Pradesh, Politics

Vijayawada reputed political leader vangaveeti radha krishna faces criticism from his cousin brother after joining TDP

వంగవీటి రాధాపై నరేంద్ర ఘాటు విమర్శలు

Posted: 03/14/2019 05:02 PM IST
Narendra hot comments on vangaveeti radha krishna

విజయవాడ ప్రముఖ నాయకుడు వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడంపై వంగవీటి రంగా సోదరుడు నారాయణరావు కుమారుడు నరేంద్ర ఘాటుగా స్పందించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందిన వంగవీటి రాధాను హత్య చేయించిన పార్టీలో ఆయన కుమారుడు ఎలా చేరుతారని ప్రశ్నించారు. ఇది చాలా దారుణమైన పరిణామమని అసహనం వ్యక్తం చేశారు. ఇదే వంగవీటి రాధా దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అక్కస్సు వెళ్లగక్కారు.

రాధా చర్యతో వంగవీటి రంగా అభిమానులంతా క్షభకు గురవుతున్నారని.. ఎవరూ ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేసే స్థితిలో లేరని దుయ్యబట్టారు. రంగా హత్యకు కారణం టీడీపీయేనని ఎవరిని అడిగినా చెబుతారని, అటువంటి పార్టీలో రాధా చేరడం బాధను కలిగిస్తోందని అన్నారు. రంగా చర్యలతో ఏ ఒక్క రంగా అభిమాని సంతృప్తిగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రంగా భార్య చేసిన తప్పునే ఇవాళ రాధా కూడా చేస్తున్నాడని విమర్శించారు.

తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకున్న రాధను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని నరేంద్ర అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఇవాళ ఉదయం విజయవాడలోని రాఘవయ్య పార్క్ సమీపంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహం వద్దకు వచ్చి రాధ చర్యలకు నిరసనగా నరేంద్ర దీక్షకు దిగగా, కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీక్షకు కూర్చున్న నరేంద్రను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles