Jana Sena announces First List of Candidates "అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌ టికెట్ల ఎంపిక"

Elections 2019 pawan kalyan stratagical selection of janasena candidates

pawan kalyan, janasena, Pawan Kalyan assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, janasena parliamentary candidates first list, Jana Sena Candidate List 2019,ap election results,ap assembly election,andhra pradesh election 2019, andhra pradesh, politics

Actor turned politician Pawan Kalyan released the first list of candidates for upcoming Lok Sabha and Andhra assembly elections. Janasena chief selects Janasena contestants after examing all stratagical plans

"అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌ టికెట్ల ఎంపిక"

Posted: 03/14/2019 02:48 PM IST
Elections 2019 pawan kalyan stratagical selection of janasena candidates

సార్వత్రిక ఎన్నికలకు నగరా మ్రోగిన నేపథ్యంలో అటు 17వ లోక్ సభతోపాటు ఇటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు షెడ్యూలు రావడం, నోటిఫికేషన్ విడుదల కావడం.. కేవలం మరో 28 రోజుల వ్యవధిలో ఎన్నికలు కూడా పూర్తవ్యనున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు తమ అస్తశస్త్రాలకు పదను పెట్టడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో తనమునకలయ్యాయి. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ కూడా ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశాయి.

కాగా, తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కంచికుని తమ పార్టీ అభ్యర్థుల తొలిబాజితాను ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులను ఇటు రాష్ట్ర అసెంబ్లీతో పాటు అటు లోక్ సభ బరిలో నిలపడం తొలిసారి అయినా.. జనసేన పోలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పాటు పవన్ కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత అత్యంత వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖారారు చేసి తొలిజాబితాను విడుదల చేశారు.

ఆయా నియోజకవర్గాలలో అన్ని సమీకరణలను పరిశీలించి.. ఆ తరువాతే అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పాటించిన సూత్రం కూడా జనసేన నూతన స్ట్రాటజీని స్పష్టం చేస్తుంది. అదేంటంటే.. బలమైన లోక్ సభ అభ్యర్ధులు లభిస్తే ఆ పరిధిలోని శాసనసభ్యుల్ని గెలిపించుకోవడం పార్టీకి సులభతరం. అలాగే బలమైన శాసనసభ అభ్యర్ధులున్నచోట లోక్‌సభ అభ్యర్ధుల గెలుపు సునాయాసమౌతుంది. ఈ సూత్రానికనుగుణంగానే పవన్‌ మొదటి విడతగా రాజమండ్రి, అమలాపురం ఎమ్‌పి అభ్యర్దుల్ని ప్రకటించారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అభ్యర్థుల ఎంపికకు పెద్దగా సమయం లేకపోవడం కూడా జనసేన ముందు ఓ సవాల్ గా మారింది. ఎన్నికలలో తమ అభ్యర్థుల ప్రచారానికి కూడా నిండుగా ఇరవై రోజు సమయం లేకపోవడం పరీక్షగా మారింది. తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న జనసేన అభ్యర్థులు ప్రజల్లో తమ పార్టీ మానిఫెస్టో తో పాటు తాము నియోజకవర్గంలో ఏం చేస్తామన్న విషయాన్ని కూడా తీసుకెళ్లాలి. దీంతో పవన్ కల్యాన్ పై ఒత్తిళ్ళు పెరుగుతుండడంతో విజయావకాశాలపై తగిన వివరాలు లేకుండానే మరికొన్ని స్థానాల్ని ప్రకటించే అవకాశాలున్నాయన్న పార్టీ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే జనసేన తరుపున బరిలోకి దిగనున్న అభ్యర్థులు కనీసం 70శాతం విజయం సాధించాలని పవన్ కల్యాణ్ అభిలాషిస్తున్నా..  నామినేషన్ల ముగింపు గడువు సమీపిస్తుండటం.. ఇక ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 25న నామినేషన్లకు చివరి తేదీ కావడం, ఆ తరువాత 28వ తేదీలోగా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం అధికారులకు తమ పార్టీ బి-ఫారాలు అందించేందుకు చివరి తేదీగా ఎన్నికల సంఘం స్పష్టం చేశాయి.

దీంతో ఈ సారి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతూ, తమ అభ్యర్థులను ప్రజామోదం కోసం పంపుతు్న పార్టీకి.. ప్రజాబీష్టం పొందాల్సిన అభ్యర్థులకు ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత సమయం కేటాయించి వుంటూ బాగుండేదని జనసేన పార్టీ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తరువాత 28 నుంచి కనీసం పక్షం రోజుల వ్యవధి కూడా అభ్యర్థులకు ప్రచారానికి కేటాయించకుండా ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించడంపై సబబు కాదని అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  stratagic selection  jana sena contestants  andhra pradesh  politics  

Other Articles