YCP To Field Weak Candidates in BJP Seats - Sting Operation వైసీపీ- బీజేపి బీ టీమే.. స్టింగ్ అపరేషన్ లో వెల్లడి

Times now sting operation exposes secret deal between bjp and ysrcp

times now, sting operation, manoj kothari, YSRCP, BJP B Team, weak candidates, chandrababu allegations, YS Jagan, VijaySai Reddy, Buggana, Ram Madhav, andhra pradesh, politics

In a recent Times Now sting operation, a YSRCP Spokesperson claims that they have a tacit understanding with the BJP & that they will field weak candidates in AP to boost BJP. He even claims the Vijay Sai Reddy is working all the details in the shadows.

వైసీపీ-బీజేపి రహస్య ఒఫ్పందం నిజమే.. స్టింగ్ అపరేషన్ లో వెల్లడి

Posted: 03/14/2019 01:35 PM IST
Times now sting operation exposes secret deal between bjp and ysrcp

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తమతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో లబ్ది పోందిన బీజేపి.. తమపై కక్షగట్టి రాష్టానికి నిధులు కేటాయించడం లేదని అధికార టీడీపీ పార్టీ గుప్పిస్తున్న అరోపణలు నిజమేనా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించకుండా అన్యాయం చేసిన పార్టీ.. ఇప్పుడు బి టీమ్ గా వైసీపీ ముసుగులో రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపులో నిజమెంత.? అంటే అవి పూర్తిగా నిజమనే స్పష్టం చేస్తుంది ఓ జాతీయ మీడియా.

వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపిల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. ఈ సంగతి తమ స్టింగ్ అపరేషన్ లో వెల్లడైందని కూడా స్పష్టం చేసింది. స్వయంగా వైసీపీ ప్రతినిధే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీలో బీజేపీకి వైసీపీ బి టీం అనడంలో సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కొన్ని స్థానాల్లో బీజేపీపై బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీతో ఓ అవగాహనకు వచ్చినట్టు విజయవాడకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి న్యూస్ చానల్ ప్రతినిధికి చెప్పుకొచ్చారు.  

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో తాము ఇంతకుముందు వారి అభ్యర్థులకు మద్దతు తెలిపినట్టు ఆయన వివరించారు. బీజేపీతో వైసీపీకి రహస్య ఒప్పందం ఉందని, ఇది వందశాతం నిజమని మనోజ్ చెప్పుకొచ్చారు. బీజేపీ కోసం వైసీపీ పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో బుగ్గన బీజేపీ నేత రాంమాధవ్‌ను కలిశారు కదా? అన్న టైమ్స్ నౌ ప్రతినిధికి మనోజ్ బదులిస్తూ.. బుగ్గన విద్యావంతుడని, ఆయనెప్పుడూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరన్నారు. బుగ్గన కలిశాకే రెండు పార్టీల మధ్య ఓ అవగాహన ఏర్పడిందా? అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులే లేరు కదా? మరి, వైసీపీ అభ్యర్థులు ఎవరైనా బీజేపీ తరపున పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. అలా జరగదన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనన్న ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిపై చాలా బలహీనమైన వ్యక్తులను నిల్చోబెడతామన్నారు. ఇదే పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.

అయితే, ఈ విషయంలో అధ్యక్షుడు జగన్ నుంచి డైరెక్టుగా ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వివరించారు. జగన్‌తో ఎవరైతే నిత్యం టచ్‌లో ఉంటారో వారి నుంచే ఇటువంటి ఆదేశాలు వస్తుంటాయన్నారు. పెద్దిరెడ్డి వంటి వారు చెబుతుంటారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని మనోజ్ పేర్కొన్నారు. జగన్‌కు రాజకీయం అంటే ఏంటో నేర్పింది విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఏమవుతారో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : times now  sting operation  manoj kothari  YSRCP  BJP B Team  weak candidates  andhra pradesh  politics  

Other Articles