Actor surya prasad arrested in murder case ఎన్ఆర్ఐ జయరాం హత్యకేసులో నటుడు సూర్య అరెస్ట్

Tollywood actor among three held in nri jayaram murder case

NRI Chigurupati Jayaram, Actor Surya prasad, anji reddy, kishore, jayaram murder case, rakesh reddy, jubiliee hills police, hyderabad, crime

Tollywood actor-comedian Surya Prasad along with two others was arrested by the police in NRI Chigurupati Jayaram murder case. Of the other two, the police took Anji Reddy into custody for not alerting the police after seeing Jayaram's murder.

ఎన్ఆర్ఐ జయరాం హత్యకేసులో నటుడు సూర్య అరెస్ట్

Posted: 03/14/2019 12:21 PM IST
Tollywood actor among three held in nri jayaram murder case

ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన తెలంగాణ పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రమేయముందని తేల్చిన జూబ్లీహిల్స్‌ పోలీసులు సినీ నటుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ హత్యకేసులో సినీనటుడు సూర్యప్రసాద్ తో పాటు అతని ఇద్దరు మిత్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

జయరాం హత్యకేసు ప్లాన్ పూర్తిగా తెలిసినా.. సినిమా షూటింగ్ కోసం డబ్బులు ఇస్తాను రమ్మని రాకేష్ రెడ్డి పిలిస్తేనే తాను వచ్చానని పోలీసులను సూర్యప్రసాద్ తప్పదోవ పట్టించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. సూర్యప్రసాద్ తోపాటు అతని స్నేహితుడు కిశోర్ ను‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెలిసినా కూడి అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించారనే విషయమై పోలీసులు విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles