One killed in Cylinder explosion సికింద్రాబాద్‌లో పేలుడు.. ఒకరు సజీవదహనం..

Cylinder explosion in secunderabad one burnt alive

Cylinder explosion, West Marredpally cylinder explosion, secunderabad explosion, person burnt alive in secunderabad, cylinder blast in secunderabad, cylinder blast in West Marredpally, cylinder blast, explosion, west marredpally, secunderabad, Telangana, Crime

One person was killed when a cylinder exploded in an apartment in West Marredpally in Secunderabad. Fire tenders rushed to the spot and doused the flames triggered by the blast

సికింద్రాబాద్‌లో పేలుడు.. ఒకరు సజీవదహనం..

Posted: 03/13/2019 05:45 PM IST
Cylinder explosion in secunderabad one burnt alive

సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెస్ట్ మారేడ్ పల్లిలో వరుస పేలుళ్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు విస్పోటనం ధాటికి భవనం అంతస్తు నేలకూలింది. స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. అసలేం జరిగిందన్న విషయం తెలుసుకునే లోపు పేలుడు సంభవించి.. ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఏరో సెల్ సైక్లిండర్ స్టోర్ రూమ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాదులోని వెస్టు మారేడుపల్లి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఏరో సెల్ సైక్లిండర్ స్టోర్ రూమ్ లో ఫైర్ సేఫ్టీ సైక్లిండర్‌లు స్టోర్ చేసి పెట్టారు. ఎండాకాలంలో గ్రీష్మతాపం అధికంగా వుండటంతో సిలిండర్లు అకస్మాత్తుగా పేలాయి. ఈ విస్పోటనంలో ఈ షాపులో పని చేస్తున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.. మరో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి బిల్డింగ్ కూలి శకాలలు కింద ఉన్న వాహనాలపై పడడంతో మూడు కార్లు, రెండు బైక్ లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మారేడ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సజీవదహనమైన వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజు (30)గా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cylinder blast  explosion  person burnt alive  west marredpally  secunderabad  Telangana  Crime  

Other Articles

Today on Telugu Wishesh