Nara Lokesh to contest from managalgiri constituency మంగళగిరి నుంచే లోకేష్.. స్పష్టతనిచ్చిన టీడీపీ..

Nara lokesh to contest from guntur managalgiri constituency

Nara lokesh to contest from AP Capital, Nara lokesh Guntur Mangalagiri, Nara lokesh mangalagiri, nara lokesh amaravati, nara lokesh Vishakapatnam East, Nara Lokesh Bheemili, Andhra pradesh, politics

After three days of excercise, calculating all equztions.. TDP party gives clarity on its party working president Nara Lokesh constituency, says he will contest from AP capital area mangalgiri for the first time.

గుంటూరు మంగళగిరి నుంచే లోకేష్.. స్పష్టతనిచ్చిన టీడీపీ..

Posted: 03/13/2019 02:54 PM IST
Nara lokesh to contest from guntur managalgiri constituency

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసి అప్పుడే మూడు రోజులు కావస్తున్నా.. పార్టీలు తమ అబ్యర్థుల జాబితాలను వెలువరించడంలో మాత్రం ఇంకా అనేక తర్జనభర్జనలు పడుతున్నాయి. కాగా, అధికార పార్టీ యువనేత నారా లోకేష్.. తొలిసారిగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో.. పలు స్థానాలు తెరపైకి వచ్చిన తరువాత తాజాగా క్లారిటీ ఇచ్చింది టీడీపీ.

తొలుత నారా వారి రాజకీయ వారసుడు ఉత్తరాంధ్ర నుంచే బరిలో దిగుతారని టీడీపీ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయి. నారా లోకేష్ విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి లేదా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగుతారని కూడా వార్తలు వచ్చాయి. అయితే భీమిలి స్థానాన్ని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కోసం రిజర్వు చేయగా, ఇక విశాఖ ఉత్తరంపై దృష్టి పెట్టిన గంట.. తాను ఎంపీ బరిలో నిలువనని కూడా చంద్రబాబు వద్ద స్పష్టం చేశారని సమాచారం.

ఈ క్రమంలో అన్ని ఈక్వేషన్స్ సరిచూసుకున్న టీడీపీ అధిష్టానం.. తాజా సమీకరణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంపై కూడా తమ జెండా ఎగురువేయాలని.. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని నారా లోకేష్ కు కేటాయించారు. తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న నారా లోకేష్.. మంత్రి పదవిని చేపట్టడంపై ఇప్పటికే విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో మంగళగిరి నుంచి గెలిచి రాజధానిపై టీడీపీ జెండాను ఎగురవేయాలని టీడీపీ అధిష్టానం నారా లోకేష్ ను ఈ స్థానం నుంచి బరిలో దింపుతుంది.

టీడీపీ కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం గత ఎన్నికలలో కేవలం 12 ఓట్లతో తేడాతో టీడీపీ ఓటమి పాలైయ్యింది. ఇక్కడి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల బరిలో నిలిచి గెలుపోందారు. బిసీ ఓటర్లు అత్యధికంగా వున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచే నారా లోకేష్ వారిని ఎలా అకర్షిస్తారు.? తమ పార్టీలోని నేతలందరినీ కలుపుకుని వెళ్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మరి నారా వారి రాజకీయ వారసుడు.. ఎప్పట్నించి ప్రచార బరిలో దిగుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi  mangalagiri  TDP  Nara Lokesh  AP capital  Andhra pradesh  politics  

Other Articles