YCP distributes its sakshi paper freely in AP ఔరా.. నిజమేనా.? ఏపీలో ఉచితంగా ‘సాక్షి’ దినపత్రిక..

Ysr congress party distributes its sakshi paper freely in andhra pradesh

sakshi, sakshi telugu paper, sakshi free copies, free distribution of sakshi daily, sakshi telugu daily, YS Jagan, YSRCP, Andhra Pradehs politics

In View of Andhra Pradesh Assembly and Lok Sabha elections, YSR congress party distributes its sakshi paper freely in main centers and rural parts of the state.

ఔరా.. నిజమేనా.? ఏపీలో ఉచితంగా ‘సాక్షి’ దినపత్రిక..

Posted: 03/12/2019 07:38 PM IST
Ysr congress party distributes its sakshi paper freely in andhra pradesh

సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు కూడా లేని ఈ తరుణంలో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికార టిడిపిలు ఈ పనిలో ముందున్నాయి. ఏదో విధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, వారిని ఆకర్షించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలవాలనే తలంపుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిదారులను వెతుక్కుంటోంది.

తమ సొంత పత్రికలో తమకు అనుకూలంగా వార్తలు రాయించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా కథనాలను, వార్తలను ప్రచురించింది. అయితే ఇకపై కూడా అదే స్ట్రాటజీ ప్లే చేయాలని భావిస్తున్న పార్టీ.. ఇక సరికొత్త విధమైన అలోచనను చేసింది. తమ పత్రిక కాబట్టి తమ అభ్యర్థులకు విరివిగా ప్రచారం చేయడంతో పాటు ఇకపై తమ పేపర్‌ను ఉచితంగా సరఫరా చేయాలని కూడా భావిస్తోందని సమాచారం. నగరాల్లోని పార్కులు, టీ స్టాల్స్‌, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో ‘సాక్షి’ పేపర్లను ఉచితంగా పంచాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఏకంగా లక్షల సంఖ్యలో ‘సాక్షి’ దినపత్రికను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ నగరాల్లో ఉదయాన్నే మార్నింగ్‌ వాక్‌కు వెళ్లేవారిని టార్గెట్‌ చేసుకుని.. వారికి ఆ పత్రికను ఉచితంగా ఇస్తున్నారు. మరికొన్ని పార్కుల్లో బెంచీలపై పడవేసి వెళ్లిపోతున్నారు. రోజుకు లక్షల కాపీలను ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా లేదని ఈ సంఘలనలు స్పష్టం చేస్తున్నాయి.

ఉచితంగా దినపత్రికను పంచడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత.. ఉచితంగా పేపర్ ను పంచడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదు. కాగా, ఎన్నికల సమయంలో ఈ విధంగా ఒక ప్రధాన పత్రికను ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పత్రుల వివరాలను సేకరించి ఈ ఖర్చులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles