IAF carries out strike across LoC within 21 minutes 21 నిమిషాల్లో టార్గెట్ కంప్లీట్.. వాయుసేనకు హాట్సాఫ్..

Surgical strike 2 india celebrates iaf s victorious strikes on jem terror camps

pakistan, loc attack, india attacks pakistan, surgical strike, loc, india pakistan loc, india conducts surgical strike, indian air force attack on pakistan, india attack on pakistan, indian air force, mirage 2000 india air force, india pakistan news, indian air force news, india attack on pakistan today, india pakistan attack, indian air force aerial strike, latest news, india attack on pakistan today, india pakistan latest news, Politics

The area is completely destroyed and according to reports in 21 minutes bombing the terror launch pads across the LoC in Balakot, Chakothi and Muzaffarabad sectors have been destructed completely along with JeM control rooms.

21 నిమిషాల్లో టార్గెట్ కంప్లీట్.. వాయుసేనకు హాట్సాఫ్..

Posted: 02/26/2019 11:51 AM IST
Surgical strike 2 india celebrates iaf s victorious strikes on jem terror camps

లష్కరే తోయిబాను హతమార్చిన క్రమంలో అగ్రరాజ్యం అమెరికా యుద్దవిమానాలు కమాండోల దాడి తరువాత తాజాగా ఇవాళ వేకువ జామున జరిగిన భారత వాయుసేన దాడిలో భారత్ సత్తా ఏంటో దాయది పాకిస్థాన్ కు తెలిసివచ్చింది. పుల్వామా ఉగ్రదాడిలో భారతమాత ముద్దుబిడ్డలు అమరులు కావడం.. యావత్ దేశం నుండి ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో భారత సంయమనం కూడా అంత మంచిదికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపు నుంచి టేకాఫ్ తీసుకున్న 12 మిరేజ్ ఫైర్ ఫైటర్ జెట్ విమానాలు కేవలం 21 నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని తిరిగి బేస్ క్యాంప్ నకు చేరుకున్నాయి. దీంతో వాయుసేన యుద్ధ విమానాల సత్తా ఎలాంటిదో మరోసారి పాకిస్థాన్ కు తెలిసివచ్చింది. ఉగ్రవాదులపై భారత ప్రతీకార దాడులు జరపడంతో.. పాకిస్థాన్ పరిస్థితి తొలు కుట్టిన దోంగగా మారింది.

క్రితం రోజు రాత్రి 11 గంటల సమయంలో.. యుద్ద విమానాల్లో పట్టినన్ని బాంబులను నింపుకుని ఉండాలని పైలట్లకు సమాచారం అందగా, ఆ వెంటనే వారు విమానాల్లో బాంబులను నింపే పనిలో నిమగ్నమయ్యారు. ఆపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు రాగా, ఆపై నిమిషాల వ్యవధిలోనే యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దిశగా సాగాయి. పాకిస్థాన్ లోని మూడు జైషే మహమ్మద్ సెంట్రల్ క్యాంపులను యుద్దవిమానాలు టార్గెట్ చేసుకున్నాయి.

ఒక్కో టార్గెట్ వైపు ఓ విమానం బాంబులతో వెళుతుండగా, దాన్ని కాపాడుతూ మూడేసి విమానాల చొప్పున వెళ్లాయని తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ విమానాల రాకను పసిగట్టి స్పందించేలోగానే ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసేయాలని చెప్పగా, గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో యుద్ధ విమానాలు ప్రయాణించాయి. విషయాన్ని పాక్ రాడార్లు పసిగట్టి, అప్రమత్తమయ్యేలోగానే దాడులను పూర్తి చేసిన ఫైటర్ జెట్స్ తిరిగి భారత భూభాగంలోకి తిరిగి వచ్చేశాయి. దీంతో దాయాది దేశం తేరుకునేలోపే ఉగ్రవాదులకు తీరని నష్టం మిగిలింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles