Massive fire at Aero India, over 300 cars gutted ఎయిర్ షో భారీ అగ్నిప్రమాదం.. సిగరేట్ పీకే కారణమా.?

Massive fire at aero india 2019 venue over 300 cars gutted

Kempegowda International Airport, Karnataka, Indus River, Indian Air Force, Fire in Bangalore Air Show 2019, fire department, Bellary, Air show in Bangalore 2019, bengaluru fire, aero india venue, yelahankha air base, bengaluru air base fire,

Aero India 2019 fire: At least 300 cars gutted after a fire broke out at the Yelahankha airbase in Bengaluru, the venue for Aero India 2019. The cause of the fire is still unknown and there are no reports of injury so far.

ఎయిర్ షో భారీ అగ్నిప్రమాదం.. సిగరేట్ పీకే కారణమా.?

Posted: 02/23/2019 03:14 PM IST
Massive fire at aero india 2019 venue over 300 cars gutted

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏరో ఇండియా షోలో వరుస అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రదర్శనను కోసం రిహార్సెల్స్ జరుగుతున్న క్రమంలో రెండు విమానాలు ఢీకొన్ని ఒక కో-పైలెట్ మృతి చెందిన ఘటనను మరువకముందే.. మరోమారు ఈ ఎయిర్ షో వార్తల్లో నిలిచింది. ఎయిర్ షో నిర్వహణను వీక్షించేందుకు వీకెండ్ సందర్భంగా భారీ సంఖ్యలో బెంగళూరు నగరవాసులు వచ్చారు.

ఈ మేరకు అంచనా వేసిన షో నిర్వాహకులు సందర్శకుల వాహనాలకు యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీకెండ్ నేపథ్యంలో శనివారం ఈ ప్రదర్శణను తిలకించేందుకు బెంగుళూరు వాసులు అనుకున్న దానికన్నా ఎక్కువగా తరలిరావడం నిర్వాహకులకు మంచి జోష్ ఇచ్చింది. దీంతో పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది.

కాగా, ఇవాళ పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. భారీ అగ్నికీలలతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 300కి పైగా కార్లు అగ్నికి ఆహుతైనట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. కార్లలోని ఇంధనం తోడు కావడంతో మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదం ఆకస్మాతుగా జరిగిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలోనే కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారు డ్రైవర్లు తాగి పడేసిన సిగరెట్ పికే కారణమని కూడా వార్తలు అందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles