Vande Bharat Express hits bike వందే భారత్ వేగం చూసి.. బైక్ వదిలేసి పరుగో పరుగు

Vande bharat express crushes bike abandoned on tracks no one injured

Vande Mataram, High-speed rail, Vande Bharat Express hits bike, Rajadhani Express, Custom motorcycle, Motorcycle components, Motorcycle boot, Ministry of Railways, Indian Railways, Central Railway zone, Allahabad Bank, Allahabad High Court, Railway Recruitment Board- Bilaspur, Burj Khalifa, Electric vehicle, Vehicle insurance

The Vande Bharat Express hit a motorcycle near Allahabad on its third commercial run on Wednesday, the railways said, adding that no one was injured in the incident. The incident occurred hours after stones were hurled at the train near Tundla in Uttar Pradesh

వందే భారత్ వేగం చూసి.. బైక్ వదిలేసి పరుగో పరుగు

Posted: 02/21/2019 10:59 AM IST
Vande bharat express crushes bike abandoned on tracks no one injured

భారతదేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయడంలో నాలుకు ఖర్చుకున్న ఓ వాహనదారుడు.. చివరకు తన ప్రాణాలు దక్కించుకుంటే చాలు అని భావించి.. బైక్ ను వదిలేసి.. తాను మాత్రం పక్కకు దూకీ తృటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. రైలు.. బైక్ రెండు వేర్వేరు మార్గాలలో పయనిస్తాయి కదా.. అన్న సందేభం వద్దు. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైలు పట్టాలపై నుంచి వాహనాలు అటుఇటు తిరుగుతూనే వుంటాయి.

ఇలానే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఓ వాహనదారుడు తన బైక్ తో పట్టాలను దాటాలనుకున్నాడు. అయితే వందే భారత్ వేగం చూసి నిర్ఘంతపోయిన వాహనదారుడు.. తేరుకుని.. బైక్ పై నుంచి దూకి తప్పించుకున్నాడు. అలహాబాద్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో వున్న ఫఫమావు వద్ద  రైల్వే ట్రాక్ పై వందేభారత్ ఎక్స్ ప్రెస్ అమితవేగంతో దూసుకొస్తుండగా, అదే సమయంలో ఓ వ్యక్తి తన బైక్ తో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. కానీ, సెకన్ల వ్యవధిలోనే వందేభారత్ రైలు అత్యంత సమీపానికి వచ్చేయడంతో బైక్ ను పట్టాలపైనే పడేసి బతుకు జీవుడా అనుకుంటూ పక్కకి దూకేశాడు. దాంతో ఆ బైక్ రైలు ధాటికి తునాతునకలైంది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందని ఉత్తర రైల్వే శాఖ ప్రతినిధి దీపక్ కుమార్ తెలియజేశారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై కొందరు రాళ్ల దాడికి యత్నించారు. యూపీలోని తుండ్లా వద్ద రైలు ప్రయాణిస్తుండగా దుండగులు రైలుపై రాళ్ల వర్షం కురిపించారు. దాదాపు రూ.97 కోట్లతో దేశీయంగా తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఆరంభం నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. తొలి పరుగులోనే సాంకేతిక కారణాలతో నిలిచిపోయి అపఖ్యాతి మూటగట్టుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vande bharat express  train 18  bike  Allahabad  uttar pradesh  crime  

Other Articles