Jaish planning even bigger strike, warn intel inputs మరో భారీ ఉగ్రదాడికి జైషే ప్లాన్.. నిఘావర్గాల హెచ్చరిక

7 jaish suicide bombers among 300 terrorists present in kashmir valley intelligence sources

India, Jaish-e-Mohammed, pulwama Attack, 21 Jaish terrorists, Adil Ahmad Dar, Maruti Eeco van, 78-vehicle CRPF convoy, three suicide bombers in J&K, Pulwama, Pakistan, Central Reserve Police Force

Emboldened by its success in the Pulwama suicide bombing, Jaish-e-Mohammad (JeM) plans to carry out another fidayeen attack of a much bigger magnitude, intelligence intercepts of conversations on February 16-17 between JeM leadership in Pakistan and its terrorists in Kashmir have revealed.

మరో భారీ ఉగ్రదాడికి జైషే ప్లాన్.. నిఘావర్గాల హెచ్చరిక

Posted: 02/21/2019 10:16 AM IST
7 jaish suicide bombers among 300 terrorists present in kashmir valley intelligence sources

జమ్మూకాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ సంస్థ మావనబాంబుకు పాల్పడిన ఘటన విషాదం నుంచి దేశం కోలుకోకముందే.. అంతకన్నా తీవ్రస్థాయిలో మరో దాడికి ఐఎస్ఐతో కలసి అదే ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పూల్వామా దాడిని అంతర్జాతీయంగా అన్ని దేశాలు, అగ్రదేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఖండిస్తున్న సమయంలోనే మరోమారు భారీ స్థాయిలో ఉగ్రవాదులు కుట్రలు పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

పుల్వామా ఉగ్రాదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరింత రెచ్చిపోతూ దాడులకు ఐఎస్ఐతో కలసి కుట్రలు పన్నుతుందని తెలుస్తుంది. పుల్వామా దాడికంటే మరింత భారీ దాడి కోసం ప్రణాళిక రచించింది. ఈ నెల 16-17 మధ్య పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ అగ్రనేతలు- ఉగ్రవాదుల మధ్య ఈ మేరకు సంభాషణ జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

భారత భద్రతా దళాలపై మరింత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడి నిర్వహించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించినట్టు చెబుతూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు. అయితే, జమ్మూలో లేదంటే జమ్ముకశ్మీర్ బయట ఈ దాడికి జైషే కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం గతేడాది డిసెంబరులో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 21 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు చెప్పారు. ఇందులో ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడైన అదిల్ అహ్మద్ దర్ పుల్వామా దాడిలో పాల్గొనగా, ఇంకా ఇద్దరు దాడికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Jaish-e-Mohammed  pulwama Attack  Pulwama  Pakistan  Central Reserve Police Force  

Other Articles