Madhulika discharged from hospital మృత్యువును జయించిన మధులిక..

Madhulika attacked by stalker discharged from hospital after complete recovery

madhulika, psycho attack, lover attack, stalker attack, brutal attack on madhulika, psycho bharat, yashoda hospitals, hyderabad, crime

Madhulika who was attacked by a stalker in early this month was discharged from hospital today afternoon. Multiple surgeries were performed by the Yashoda hospital doctors to bring her health condition to stable.

మృత్యువును జయించిన మధులిక.. భరత్ ను కఠినంగా శిక్షించాలి..

Posted: 02/20/2019 04:57 PM IST
Madhulika attacked by stalker discharged from hospital after complete recovery

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడిన మధులిక పక్షం రోజుల తరువాత మృత్యువును జయించింది. మలక్ పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించిన క్రమంలో.. రాత్రింబవళ్లూ శ్రమించి.. అమె అరోగ్యంగా కోలుకోవాలని, సాధారణ స్థితికి రావాలని గత పక్షం రోజులుగా యశోధా వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అమె అరోగ్యం బాగుపడిన తరుణంలో.. కోలుకున్న అమెను వైద్యులు ఇవాళ అస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ప్రేమోన్మాది కసాయి భరత్ కత్తి దాడిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ అనుక్షణం నరకం అనుభవించిన మధులిక ఎట్టకేలకు కోలుకుంది. అమె అరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో డాక్టర్లు బుధవారం డిశ్చార్జి చేశారు. మెదడుకు గాయాలు కావడంతో డాక్టర్లు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ పలు సర్జరీలు చేశారు. క్రమంగా ఆమెకు ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో ఇంటికి పంపించారు.

తనపై దాడి చేసిన భరత్ ను కఠినంగా శిక్షించాలని మధులిక డిమాండ్ చేస్తోంది. తనను ఇంత క్షోభపెట్టిన అతడిని వదిలిపెట్టకూడదని కోరుతోంది. భరత్ చిన్నప్పట్నుంచీ పరిచయమని, అందుకే కనిపించినప్పుడల్లా మాట్లాడేదానని మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో మధులిక చెప్పింది. అయితే తనపై ఇంతటి కోపాన్ని పెంచుకుంటాడని ఊహించలేదని పేర్కొంది. ఈ నెల 6న బర్కత్‌పుర వద్ద ప్రేమోన్మాది భరత్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో మధులికపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దీంతో మధులికకు తల, చేతులతో మెదడుపై కూడా దాడి ప్రభావం పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో 74 గంటలపాటు అపస్మారక స్థితిలోనే ఉన్న బాధితురాలికి యశోధా అసుపత్రి వైద్యులు పక్షం రోజులుగా కష్టపడి పునర్జన్మను ప్రసాదించారు. రక్తం ఎక్కించిన తర్వాత రక్తపోటు నియంత్రణలోకి రావడంతో వైద్యులు తలతో పాటు ఇతర గాయాల వద్ద పలు సర్జరీలు చేశారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణతో మధులిక క్రమంగా కోలుకుంది. దాదాపు 10 మందితో కూడిన యశోద వైద్య బృందం ఆమెకు వైద్యసేవలు అందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhulika  psycho attack  lover attack  psycho bharat  yashoda hospitals  hyderabad  crime  

Other Articles