Errabelli Dayakar Rao’s dream is fulfilled ఎన్నాళ్లకెన్నాళ్లకో తీరిన ‘ఎర్రబెల్లి’ కల

Errabelli dayakar rao s dream is fulfilled set to take oath as minister

Errabelli Dayakar Rao, Telangana minister, cabinet, lakshmi parvati, NTR, Chandrababu, CM KCR, TDP, TRS, politics

Six-time MLA Errabelli Dayakar Rao is all set to take oath as a minister in the KCR cabinet ,fulfilling a long-cherished dream. Contesting on the TRS ticket for the first time, he won from Palakurthi constituency for the third consecutive time.

ఆరు పర్యాయాలకు కానీ నెరవరని ఎర్రబెల్లి ‘అమాత్య’ కల

Posted: 02/19/2019 11:44 AM IST
Errabelli dayakar rao s dream is fulfilled set to take oath as minister

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే మంత్రి బాధ్యతలను చేపట్టేందుకు పలు పర్యాయాలు ఎదురుచూసిన ఎర్రెబల్లి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి లభించింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒక పర్యాయం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికైనా.. తనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదన్న అవేదనకు గురయ్యారు. కాగా, తనకు తొలిసారిగా మంత్రిగా కేసీఆర్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడం, బాధ్యతలు చేపట్టనుండటంపై సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు.

కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటానని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరినీ కలుపుకుని ముందుకెళతానని స్పష్టం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు... జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఏ బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించినా.. వాటిని తూచా తప్పకుండా పాటిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో తనకు మంత్రి పదవులు రాకపోవడానికి గల కారణాలు వివరించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనకు మంత్రి పదవి వచ్చేదని వివరించిన ఎర్రబెల్లి... అప్పట్లో తనకు మంత్రి పదవి దక్కకుండా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తరువాత చంద్రబాబుతో కలిసి టీడీపీలో కొనసాగిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. అది దక్కలేదని అన్నారు. తనను మంత్రిని చేస్తానని చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారని గుర్తు చేసుకున్న ఎర్రబెల్లి... ఆయన మాట తప్పారని వెల్లడించారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు ఎర్రబెల్లి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli Dayakar Rao  Telangana minister  cabinet  lakshmi parvati  NTR  Chandrababu  CM KCR  TDP  TRS  politics  

Other Articles