nagababu clariffies on janasena donation జనసేనకు విరాళంపై నాగబాబు క్లారిటీ..

Nagababu slams prudhvi on janasena donation allegations

pawan kalyan, janasena, Pawan Kalyan nagababu, nagababu my channel naa ishtam, Pawan Kalyan Prudhvi, Pawan kalyan janasena donation, Pawan Kalyan nagababu Prudhvi, YCP leader Prudhvi, pawan kalyan nagababu, Prudhvi, janasena donation, andhra pradesh, politics

Mega brother actor and producer Nagababu slams comedian Prudhvi on his comments. Pruthvi allegedly made allegations on Nagababu and Varun Tej donations for Janasena.

హస్యనటుడు పృథ్వీకి నాగబాబు వార్నింగ్.. జనసేనకు విరాళంపై క్లారిటీ..

Posted: 02/19/2019 10:58 AM IST
Nagababu slams prudhvi on janasena donation allegations

రాజకీయ రణక్షేత్రంలో తన పార్టీ కూడా పోటీలో వుంటుందని చెప్పడంతో పాటు పలు చోట్ల అభ్యర్థులను కూడా ఖరారు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీపై విమర్శలు కూడా అదేస్థాయిలో వస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేయడంపై మెగా బ్రదర్, సినీనటుడు నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విమర్శలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.

జనసేనపై విమర్శలు చేసేవారిని టార్గెట్ చేసుకుని వారికి వార్నింగ్ లు ఇస్తూనే.. ప్రజలకు తెలియాలి కాబట్టి అంటూ వివరణ కూడా ఇస్తున్నారు నాగబాబు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే వారికి ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, జగన్.. ఇలా ఎవరినీ వదలడం లేదు. తాజాగా, ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత పృథ్వీకి హెచ్చరిక జారీ చేశాడు.

వరుణ్ తేజ్ తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25 కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చాడు. ఇటీవల పృథ్వీ మాట్లాడుతూ.. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మును విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేనకు విరాళంగా ఇచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్న ఆయన.. పాత్రికేయుల ద్వారానే విన్నానని అన్నారు.

పృథ్వీ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన నాగబాబు.. అతడలా అన్నాడంటే నమ్మలేకుండా ఉన్నానని, ఒకవేళ అని ఉంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసి మరీ సమాధానం చెబుతానని హెచ్చరించాడు. పృథ్వీ దగ్గర తన ఫోన్ నంబరు ఉందని, అతడికేమైనా అనుమానాలుంటే తనకు నేరుగా ఫోన్ చేసి అడగొచ్చని సూచించాడు. జనసేనకు తామిచ్చిన విరాళం అధికారికమేనని నాగబాబు స్పష్టం చేశాడు. తమ కుటుంబంపై బురద జల్లడం ఇది కొత్తకాదని ముక్తాయింపు ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nagababu  Prudhvi  janasena donation  andhra pradesh  politics  

Other Articles