pawan kalyan promises of changing penugonda name అధికారంలోచ్చాక పెనుగొండ పేరుమార్పు.?: పవన్

Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

pawan kalyan, janasena, penugonda, sri vasavi kanyakaparameshwari, idol inaguaration, andhra pradesh, politics

Actor turned politician, JanaSena chief Pawan Kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol in west godavari district and promises locals of changing penugonda name on goddess.

‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

Posted: 02/14/2019 06:13 PM IST
Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణ కుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పంచలోహాలతో తయారు చేసిన 90 అడుగుల వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య పవన్ కల్యాణ్ అవిష్కరించారు. ఆ తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరకున్న భక్తజనసందోహం కోరిక మేరకు మాట్లాడిన పవన్ కల్యాణ్, ధర్మం దారి తప్పినప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణం చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారని పేర్కోన్నారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పెనుగొండకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఆ చల్లని తల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడచులపై ఉండాలని ఆకాంక్షించారు. అంతుకుముందు, పెనుగొండ వాసవీ మాత దర్శనానికి వెళ్లిన పవన్ కు ఆలయ మర్యాదల ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ వాసవీ మాత భారీ విగ్రహాన్ని దర్శించుకున్న పనవ్, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  penugonda  sri vasavi kanyakaparameshwari  andhra pradesh  politics  

Other Articles