another twist in tamil actress murder case తమిళ నటి సంధ్య కేసులో మరో ట్విస్టు..

Another twist in tamil actress sandhya brutal murder case

Filmmaker Murders, Balakrishnan, Sandhya, Chennai Filmmaker, Chennai Police, kadhal ilavasam director, kadhal ilavasam director case, Cooum River, Chennai, Tamil Nadu, Crime

The 51-year-old director bala krishnan confessed to committing the crime and said he murdered his wife as he doubted her loyalty, informed the police.

తమిళ నటి సంధ్య కేసులో మరో ట్విస్టు..

Posted: 02/11/2019 12:35 PM IST
Another twist in tamil actress sandhya brutal murder case

ఎంతటి నేరమైనా.. తప్పక వెలుగులోకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి.. నేరగాళ్లు ఎన్నో ప్రణాళికలు రచించి.. తాము పోలీసులకు ఎప్పటికీ దొరకబోమనే నమ్మకంతో వుంటారు. అయితే నేరానికి పాల్పడే క్రమంలో వారు చేసే తప్పులే.. పోలీసులకు కీలక అధారాలుగా మారి ఎట్టకేలకు చిక్కిపోతారు. కొన్ని కేసులు ఆధారలు లేవని క్లోజ్ అయినా అవి తాత్కాలికంగానే తప్ప.. ఎప్పటకీ మాత్రం కాదు. నేరం చేసినవాడు పట్టుబడక తప్పదు.

ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పకడ్బంధీగా హత్యచేశామని నేరస్థుడు ధీమాగా వున్నా.. కటకటాల పాలైన తరువాత మాత్రం నేరం చేయాల్సింది కాదు.. అన్న పశ్చాతాపానికి లోనవుతారు. ఇలానే తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నందన అనుమానంతో.. తనకు వచ్చిన అవేశాన్ని జీర్ణించుకోలేక అతిదారుణంగా హత్య చేసిన తమిళ సినీ సహాయ దర్శకుడు, చిన్న సినిమాల నిర్మాత బాలకృష్ణన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ఈ దారుణ హత్యకేసులో మరో ట్విస్టు బయటపడింది

తమిళ నటి సంధ్యను ఆమె భర్త, దర్శకుడు బాలకృష్ణన్‌ ఇటీవల కిరాతకంగా హత్య చేసిన అమె శరీర బాగాలను నగరంలోని పలు ప్రాంతాలలో ఏడు చోట్ల విసిరేయడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. మహిళ శరీర అవయవాలు లభించిడంతో.. మిస్టీరియస్ కేసుగా నమోదు చేసుకున్న చెన్నై చేధించిన పోలీసులు రెండు వారాల వ్యవధిలో నిర్మాత, దర్శకుడు బాలకృష్ణన్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

భార్యను దారుణంగా హత్యచేసి.. ముక్కలు ముక్కలుగా పలు చోట్ల పడేయడానికి ఓ స్నేహితుడే కారణమని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సదరు స్నేహితుడు చెప్పిన స్క్రీన్ ప్లేలో ఇలాంటి ఓ సీన్ ఉందనీ, దాని ఆధారంగానే బాలకృష్ణన్‌ ఈ దారుణానికి తెగబడ్డారని వ్యాఖ్యానించారు. ఇటీవల బాలకృష్ణన్‌ తెరకెక్కించిన ‘కాదల్ ఇలవశం’ సినిమా పరాజయం పొందడంతో ఆయన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అంతేకాకుండా ఈ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఓ థ్రిల్లర్ సినిమాను తీసేందుకు బాలకృష్ణన్‌ సిద్ధమయ్యాడని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Filmmaker Murders  Balakrishnan  Sandhya  Cooum River  Chennai  Tamil Nadu  Crime  

Other Articles

 • Actress and director vijaya nirmala is no more

  ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

  Jun 27 | అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో... Read more

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

Today on Telugu Wishesh