lotus can bloom even in London and America: Shiv Sena ‘‘అమెరికా, లండన్లలోనూ అధికారంలోకి బీజేపి..’’

With evm lotus can bloom even in london and america shiv sena

Evms, Electronic Voting Machines, VVPAT Machines, EVM hacking, EVM tampering, VVPAT slips counting, Shiv Sena, BJP, Maharashtra, Saamana, Shiv Sena-BJP alliance, Lok Sabha election 2019, Narendra Modi, Politics

BJP's estranged NDA ally Shiv Sena has once again attacked the saffron party, in a strongly worded article in its mouthpiece Saamana, the party said, ''With EVM and this kind of shallow confidence, lotus can blossom even in London and America.''

‘‘అమెరికా, లండన్లలోనూ అధికారంలోకి బీజేపి..’’

Posted: 02/11/2019 11:41 AM IST
With evm lotus can bloom even in london and america shiv sena

మన దేశంలో గత సార్వత్రిక ఎన్నికలలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోనే.. ఎన్నికలు పెడితే బ్రిటన్, అమెరికాల్లోనూ కమలం వికసిస్తుందని ఎన్టీయే మిత్రపక్షమైన శివసేన వ్యంగంగా స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ప్రతిపక్షాలు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్ లను కౌంటింగ్ చేసే పద్దతిని వినియోగించాలని లేదా పాత రోజుల్లో వినియోగించిన బ్యాలెట్ పద్దతిని అవలంభించాలని కోరాయి.

అయితే వారి డిమాండ్లకు తాజాగా ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కూడా తోడైంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండే శివసేన, తమ అధికార 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ త్వరలోనే కనుమరుగై, అసలు నిజం తెలిసివస్తుందని అభిప్రాయపడింది. ఇవే ఈవీఎంలను వాడుతూ ఎన్నికలు జరిపితే ఎక్కడైనా బీజేపీ విజయం సాధిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సందించింది.

ఇటు మహారాష్ట్రతో పాటు అటు కేంద్రంలోని మోడీ సర్కారును టార్గెట్ చేసిన సామ్నా.. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించింది. ఈ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నావిస్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లోక్ సభ స్థానాన్ని కూడా తాము రానున్న ఎన్నికలలో గెలుచుకుంటామని ఇటీవల జరిగిన సభలో ప్రకటించిన నేపథ్యంలో దీనిపై సామ్నా కూడా అదేస్థాయిలో మండిపడింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి ఒక్క సీటు అధికంగా వస్తుందన్న సీఎం ధీమా వ్యక్తం చేసిన క్రమంలో.. శివసేన మాత్రం ఈ నంబర్ ఎంత తగ్గుతుందో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొందని, బీజేపీకి కష్టకాలం ముందుందని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులు, ఇప్పుడు పునరాలోచించుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. లేకుంటే ఇప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవారంతా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Evms  VVPAT Machines  Shiv Sena  BJP  Maharashtra  Saamana  Lok Sabha election 2019  Narendra Modi  Politics  

Other Articles