దేశానికే ప్రతిష్టాత్మకంగా మారతుందని, దీంతో గంటల ప్రయాణం కేవలం మూడు నాలుగు గంటలలోపు పూర్తవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినా.. ఈ బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా సాక్షాత్తూ ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ రైతులు ఆందోళన బాట పట్టడం సంచలనం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 గ్రామాల నుంచి ప్రజలు బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించారు. నవ్సారి తాలుకాలో జనథాన పట్టణం నుంచి ప్రారంభమైన రైతుల నిరసన ర్యాలీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.
బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా 14 అభ్యంతరాలను లేవనెత్తిన 29 గ్రామాల రైతులు నిరసన ర్యాలీగా వెళ్లి.. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని వినతిపత్రాన్ని సమర్పించారు. బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం రెండులక్షల చెట్లను నరకాలని, దీనివల్ల పచ్చదనానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని రైతు నాయకుడు జయేష్ పటేల్ ఆరోపించారు. బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం తమ పచ్చని పొలాలు ఇవ్వమని 29 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు.
కాగా నవ్సారి జలాల్ పూర్ తాలుకాల ఖేదుత్ సమాజ్ అధ్యక్షుడు సిపీ నాయక్ మాట్లాడుతూ.. సాగుకు అత్యంతయోగ్యమైన భూమిని ప్రభుత్వం బుల్లెట్ రైలు కోసం సేకరించడం తగదని అన్నారు. ఈ ప్రాంతాల్లో శతాబ్దానికి పైగా రైతులు మేలు రకం మామిడి పండ్లను పండిస్తున్నారని తెలిపారు. ఇలాంటి భూమిని తీసుకున్న ప్రభుత్వం తమకు ఫీటుకు యాభై నుంచి 100 రూపాయలను పరిహారంగా ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.
కాగా ఈ నెల 8న కూడా రైతులకు మద్దతుగా వ్యవసాయ సంఘాల కమిటీ కూడా భారీ ర్యాలీని, నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం పొలాలను సేకరించి 2023లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అహ్మదాబాద్- ముంబయి బుల్లెట్ రైలు, అహ్మదాబాద్- గాంధీనగర్ మెట్రోరైలు ప్రాజెక్టుల కోసం భూములను జపాన్ పార్లమెంటరీ ఉప మంత్రి అకిమోటో మసటోషి పరిశీలించారు. రూ. 3,500 కోట్లతో నిర్మించనున్న ఈ రైలుమార్గం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Feb 20 | ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడిన మధులిక పక్షం రోజుల తరువాత మృత్యువును జయించింది. మలక్ పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించిన క్రమంలో.. రాత్రింబవళ్లూ... Read more
Feb 20 | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రాంతాలను కలుపుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రస్తుతం ప్రమాదాలకు నెలవుగా మారింది. ఆ మధ్యకాలంలో వేగంగా... Read more
Feb 20 | దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ విఫ్.. చింతమనేని ప్రభాకర్.. ఏలూరులో తన అనుచరవర్గంతో ధర్నాకు దిగారు. తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు నెట్టింట్లో దుష్ప్రచారం చేస్తున్నారన్ని అరోపిస్తూ.. ఈ ప్రచారంపై పోలీసులు వెంటనే చర్యలు... Read more
Feb 20 | సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల కాలంలో వివాదాల్లో చిచ్చుకుంటున్నారు. నటుడిగా తనపని తాను చేసుకుపోతున్న టాలీవుడ్ ప్రిన్స్ ను సినీ వాణిజ్యరంగంలోకి అడుగెపెట్టిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్... Read more
Feb 20 | అదృష్టం బాగుందంటే.. కాలకూట విషం కూడా అమృతంగా తయారవుతుందని.. పెద్దలు చెప్పిన మాట.. అక్షరాల నిజమైంది. అకస్మాత్తుగా వెనుకనుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో.. అదుపు తప్పి గాల్లోకి ఎగిరిన యువతి.. ఏకంగా ఫ్లయ్... Read more