Police arrest film maker balakrishnan in his wife's murder case సినీనటి హత్యకేసులో భర్త, దర్శకుడు అరెస్టు..

Filmmaker kills wife chops up her body and disposes it in dustbins

Filmmaker Murders, Balakrishnan, Sandhya, Chennai Filmmaker, Chennai Police, kadhal ilavasam director, kadhal ilavasam director case, Cooum River, Chennai, Tamil Nadu, Crime

A filmmaker was arrested in Chennai for allegedly murdering his wife, an aspiring actress. The woman's body parts, without the head, were found in a dumpyard in the city last month.

సినీనటి హత్యకేసులో భర్త, దర్శకుడు అరెస్టు..

Posted: 02/07/2019 12:24 PM IST
Filmmaker kills wife chops up her body and disposes it in dustbins

ఎంతటి నేరమైనా.. తప్పక వెలుగులోకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి.. నేరగాళ్లు ఎన్నో ప్రణాళికలు రచించి చేసినా.. పోలీసులు తప్పక నేరగాళ్లను తమ అదుపులోకి తీసుకుంటారన్న విషయం తెలిసిందే. పోలీసులు రికార్డుల్లో ఒక్కసారి నేరస్తుడిగా ముద్రపడితే.. ఎక్కడికి తప్పించుకుపోయింనా.. ఎన్ని ఏళ్లైయినా.. చివరకు శిక్ష పడక తప్పదు. ఇదే విషయాం అనేక కేసుల్లో వెలుగుచూసింది. ఏకంగా 22 ఏళ్ల క్రితం నేరం చేసిన తప్పించుకున్న ఓ వ్యక్తికి తాజాగా శిక్ష పడటమే ఇందుకు ఉదాహరణ.

అయినా నేరగాళ్లు మాత్రం తాము ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేశామని తాత్కాలికంగా పొంగిపోయినా.. కటకటాల పాలైన తరువాత మాత్రం నేరం చేయాల్సింది కాదు.. అన్న పశ్చాతాపానికి లోనవుతారు. ఇలానే తన భార్యను అతిగా ప్రేమించిన ఓ వ్యక్తం అమె వివాహేతర సంబంధం పెట్టుకున్నందన అనుమానంతో.. తనకు వచ్చిన అవేశాన్ని జీర్ణించుకోలేక ఏకంగా హత్య చేశాడు. అమె శరీర బాగాలను చెత్తకుప్పలతో పాటు నదిలో పారవేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే తమిళ సినీ సహాయ దర్శకుడు, చిన్న సినిమాల నిర్మాత బాలకృష్ణన్.

తమిళనాడులోని చెన్నై శివారులో జరిగిన ఈ ఘటనలో రెండు వారాల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 21న పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో ఓ యువతికి చెందిన కాళ్లు, చేయిని గుర్తించారు. ఆమె ఎవరన్నది తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి చెన్నైలోని ఈక్కాడుతాంగల్‌లో ఉంటున్న నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య (38)గా గుర్తించారు.  

సినిమాల్లో నటించే సహాయ నటి అయిన సంధ్య గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త, సహాయ దర్శకుడు అయిన బాలకృష్ణన్‌ (51)ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. సంధ్య రాత్రుళ్లు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుతుండడం, అస్తమాను బయటకు వెళ్తుండడంతో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణ అనుమానించాడు.

 ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ విషయంలో భార్యను పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె వినిపించుకోకపోగా, తాను ప్రియుడితోనే ఉంటానని సంధ్య తేల్చి చెప్పింది. దీంతో గత నెల 19న దంపతులిద్దరూ మరోమారు గొడవ పడ్డారు. దీంతో సహనం కోల్పోయిన బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Filmmaker Murders  Balakrishnan  Sandhya  Cooum River  Chennai  Tamil Nadu  Crime  

Other Articles

 • Madhulika attacked by stalker discharged from hospital after complete recovery

  మృత్యువును జయించిన మధులిక.. భరత్ ను కఠినంగా శిక్షించాలి..

  Feb 20 | ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడిన మధులిక పక్షం రోజుల తరువాత మృత్యువును జయించింది. మలక్ పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించిన క్రమంలో.. రాత్రింబవళ్లూ... Read more

 • Man charred to death as moving car catches fire in hyderabad

  ITEMVIDEOS: ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం..

  Feb 20 | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రాంతాలను కలుపుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రస్తుతం ప్రమాదాలకు నెలవుగా మారింది. ఆ మధ్యకాలంలో వేగంగా... Read more

 • Chintamaneni stages protest on ycp spreading hatred and morphed speech

  ఏలూరులో రగడ.. దళితులు, వైసీపీకి పోటీగా చింతమనేని ధర్నా..

  Feb 20 | దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ విఫ్.. చింతమనేని ప్రభాకర్.. ఏలూరులో తన అనుచరవర్గంతో ధర్నాకు దిగారు. తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు నెట్టింట్లో దుష్ప్రచారం చేస్తున్నారన్ని అరోపిస్తూ.. ఈ ప్రచారంపై పోలీసులు వెంటనే చర్యలు... Read more

 • Tollywood actor mahesh babu s multiplex allegedly violated gst norms served notice

  మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల షాక్.. నోటీసులు జారీ..

  Feb 20 | సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల కాలంలో వివాదాల్లో చిచ్చుకుంటున్నారు. నటుడిగా తనపని తాను చేసుకుపోతున్న టాలీవుడ్ ప్రిన్స్ ను సినీ వాణిజ్యరంగంలోకి అడుగెపెట్టిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్... Read more

 • Woman on bike miraculously survives after being thrown off flyover

  ITEMVIDEOS: ఫ్లయ్ ఓవర్ పై నుంచి ఎగిరిపడింది.. కానీ..!

  Feb 20 | అదృష్టం బాగుందంటే.. కాలకూట విషం కూడా అమృతంగా తయారవుతుందని.. పెద్దలు చెప్పిన మాట.. అక్షరాల నిజమైంది. అకస్మాత్తుగా వెనుకనుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో.. అదుపు తప్పి గాల్లోకి ఎగిరిన యువతి.. ఏకంగా ఫ్లయ్... Read more

Today on Telugu Wishesh