Woman, Paramour arrested for killing husband in Hyderabad మేనల్లుడితో కలసి భర్తను హత్యచేసి.. కటకటాల్లోకి..

Would be sub inspector kills husband with lover s help dumps body on tracks

would be sub-inspector, would be SI, sangeetha, srinivas, paramour vijay, Railway Employee Srinivas, Borabanda railway station, Hyderabad murder, Crime

A 26-year-old woman, who recently qualified for sub-inspector, and her lover were arrested for allegedly killing the former’s husband and dumping his body on railway tracks.

మేనల్లుడితో కలసి భర్తను హత్యచేసిన కాబోయే మహిళా ఎస్ఐ

Posted: 02/06/2019 12:43 PM IST
Would be sub inspector kills husband with lover s help dumps body on tracks

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంగా భర్తను హతమార్చిన ఓ కాబోయే ఎస్ఐ కటకటాలను లెక్కిస్తున్న దారుణ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. సంగీత, శ్రీనివాస్ భార్యాభర్తలు. శ్రీనివాస్ రైల్వే ఉద్యోగి. సంగీత తన మేనల్లుడు విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తన భార్యను తరచుగా హెచ్చరించేవాడు.

ఈ క్రమంలో ఆమెపై వేధింపులకు పాల్పడేవాడు. దీంతో, తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సంగీత భావించింది. విజయ్ తో కలిసి ఈ హత్యకు పథకం వేసింది. శ్రీనివాస్ కు విద్యుత్ షాక్ ఇచ్చి హత మార్చాలని ఆమె చెప్పింది. కానీ, అలా కాకుండా వేరే మార్గంలో హతమారుద్దామని విజయ్ సలహా ఇచ్చాడు. రైల్వే ట్రాక్ పక్కనే సంగీత నివాసం ఉండటంతో వీరికో ఆలోచన వచ్చింది. రైలు వచ్చే సమయంలో నిద్రిస్తున్న తన భర్త తలపై బండరాయితో మోదాలని నిర్ణయించారు. రైలు శబ్దంలో తన భర్త అరుపులు బయటకు వినపడకుండా ఉంటాయని వేసిన ఈ ప్లాన్ ని ఇద్దరూ పక్కాగా అమలు చేశారు.

శ్రీనివాస్ ని హతమార్చిన అనంతరం, ఆ మృతదేహాన్ని బోరబండ రైల్వేట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. శ్రీనివాస్ తమ్ముడిని పోలీసులు విచారణ చేయగా, తన వదిన సంగీతపై అతను అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు సంగీత, విజయ్ ను అరెస్టు చేశారు. కాగా, సంగీత బీఈడీ పూర్తి చేసింది. ఇటీవలే ఎస్సై పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది. కాబోయే మహిళా ఎస్సై ఈ దారుణానికి పాల్పడటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : would be SI  sangeetha  srinivas  paramour vijay  Borabanda railway station  Hyderabad murder  Crime  

Other Articles

  • Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

    చిదంబరం విషయంలో.. కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

    Aug 21 | ‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి... Read more

  • Inx media scam chidambaram might be arrested at any time

    ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

    Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం వుందన్న వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఇవాళ... Read more

  • Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

    భారత్ లోకి బికిని ఎయిర్ లైన్స్.. 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్..

    Aug 21 | భారత దేశ నుంచి మరో దేశం తమ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. వియత్నాంకు చెందిన వియత్ జట్ ఎయిర్ లైన్స్.. ఇండియా నుంచి తమ దేశంలోని ముఖ్యనగరమైన హో చి... Read more

  • Inx media scam chidambaram petition may not get cleared for hearing in sc

    చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ 23కు వాయిదా

    Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిదంబరం ఆ అజ్ఞాతం వీడక తప్పదనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలినట్టయింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు... Read more

  • Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

    ITEMVIDEOS: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

    Aug 21 | అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అక్కడి ఓ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించేందుకు నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో ఆయను నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన... Read more

Today on Telugu Wishesh